భార్య ముందు ఇజ్జత్ కాపాడాడు.. పక్కకు తీసుకెళ్లి బాదాడు..
By తోట వంశీ కుమార్ Published on 25 March 2020 9:25 AM GMTకరోనా వైరస్ (కొవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజు రోజుకు ఈ మహమ్మారి విభృంభిస్తోంది. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుకే చర్యలు చేపట్టాయి. వచ్చే నెల 21 వరకు భారత్ లాక్‌డౌన్ సంగతి తెలిసిందే. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ సహా అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. సామాజిక దూరం పాటించాలని అప్పుడే కరోనా వైరస్ నుంచి బయట పడగలమని సూచించిన సంగతి తెలిసిందే. అత్యవసరం కాకుండా బయటికి వస్తే పలు చోట్ల పోలీసులు తమ లాఠీలకు పని చెబుతున్నారు.
ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి బైక్ పై వెలుతున్నాడు. ఓ పోలీస్ ఆ బైక్‌ను ఆపాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జర్నీలు చేయకుడదని చెప్పాడు. అయినా ఆ వ్యక్తి వినకపోవడంతో అతడిని అక్కడి నుంచి జీప్ వెనక్కు తీసుకెళ్లి లాఠీతో నాలుగు దెబ్బలు వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియనప్పటికి ఆ పోలీస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయ్యారు. భార్య ముందు అతడి పరువు కాపాడాడు.. పక్కకు తీసుకెళ్లి నీ ధర్మాన్ని నిర్వర్తించావు.. నువ్వు నిజమైన పోలీస్ అని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
[video width="400" height="184" mp4="https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/03/WhatsApp-Video-2020-03-25-at-2.42.12-PM.mp4"][/video]