భారత్-చైనాల మధ్య ఘర్షణ.. సూర్యాపేట వాసి మృతి
By తోట వంశీ కుమార్ Published on 16 Jun 2020 1:08 PM GMTలద్దాఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద సరిహద్దుల్లో భారత్, చైనా బలగాలు బాహాబాహీకి దిగాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోవడంతో భారత సైన్యానికి చెందిన ఓ కల్నల్ స్థాయి అధికారితో పాటు ఇద్దరు సైనికులు అమరులయ్యారు. ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్న క్రమంలో లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు.
ఈ ఘటనలో మృతి చెందిన ముగ్గురు సైనికుల్లో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన వ్యక్తి ఉన్నారు. సరిహద్దులో చనిపోయిన కల్నల్ సంతోష్ సూర్యాపేటకు చెందిన వ్యక్తి. బీహారు 16వ బెటాలియన్ లో సంతోష్ పని చేస్తున్నాడని సమాచారం. సంవత్సరం నుంచి చైనా సరిహద్దు లో పనిచేస్తున్న సంతోష్ కు మూడు నెలల క్రితమే హైదరాబాద్ బదిలీ అయింది. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో చైనా సరిహద్దు లోనే ఉండి పోయిన సంతోష్ ఈరోజు దేశం కోసం ప్రాణాలు అర్పించారు.
సంతోష్ కోరుకొండ సైనిక్ స్కూలులో విద్యాభ్యాసం పూర్తి చేశారు. తండ్రి ఉపేందర్ స్టేట్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందరు. ఆయనకు భార్య సంతోషి, కుమారై అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్(4) ఉన్నారు. సంతోష్ మరణ వార్త విని ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఆయన అత్త ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కల్నల్ సంతోష్ మరణం ఫై అయన తల్లిని స్పందించారు. తన కుమారుడు పోరాడి అమరుడైనందుకు సంతోషంగా ఉందన్నారు. ఉన్న ఒక్క కొడుకు చనిపోవడం భాదగా ఉందని, అయితే దేశం కోసం తన కొడుకు చనిపోవడం ఆనందంగా ఉందని ఉబికివచ్చే కన్నీళ్లతో ఆ మాతృమూరి అన్నారు.
ఈ ఘటనలో చెనా సైనికులు కూడా మృతిచెందినట్లు సమాచారం. అయితే ఎంతమంది చనిపోయారన్న విషయంపై స్పష్టత కావాల్సి ఉంది. దాదాపు 45 ఏళ్ల తర్వాత చెనాతో జరిగిన గర్షణలో భారత సైనికులు మృతి చెందారు. చివరిసారి 1975లో అరుణాచల్‌ప్రదేశ్‌లోని తులుంగ్ లా ప్రాంతంలో జరిగిన ఘర్షణలో నలుగురు జావాన్లు అమరులయ్యారు.