ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌.. ఈయన పేరు అందరికి తెలిసిందే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో యోగి పేరు మారుమోగిపోయింది. అంతేకాదు ప్రభుత్వ అధికారులను సైతం ఉరుకులు పరుగులు పెట్టించారు. బాధ్యతలు పట్టిననాటి నుంచి అన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.అలాగే ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో దేశంలో బెస్ట్‌ సీఎంగా తేలారు. తాజాగా యోగి ఆదిత్యానాథ్‌ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. రాష్ట్రానికి సీఎంగా వరుసగా మూడేళ్లు పూర్తి చేసుకున్న ఏకైక బీజేపీ ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 312 స్థానాలు దక్కించుకున్న విషయం తెలిసిందే. అదే సంవత్సరం మార్చి 15న ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా యోగి బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో నేటితో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తి అయింది.

అంతకు ముందు బీజేపీ తరపున కల్యాణ్‌ సింగ్‌, రామ్‌ ప్రకాశ్‌, రాజ్‌నాథ్‌లు ముఖ్యమంత్రులుగా పని చేసినప్పటికీ.. ఎవరూ కూడా మూడేళ్లు పదవిలో కొనసాగలేకపోయారు. గత ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన మెజార్టీ రావడంతో తన పదవికి ఎలాంటి ఆటంకం కలగకుండా యోగి సీఎం పదవిలో కొనసాగుతున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.