ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆర్బీఐ ఆదేశాలు బేఖాతరు

By సుభాష్  Published on  14 March 2020 10:03 AM GMT
ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆర్బీఐ ఆదేశాలు బేఖాతరు

యెస్‌ బ్యాంక్‌ సంక్షోభం నేపథ్యంలో ప్రైవేటు బ్యాంకుల నుంచి బయటకు వచ్చి జాతీయ బ్యాంకుల బాట పట్టాలని ప్రభుత్వ సంస్థలకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు తమ బ్యాకింగ్‌ కార్యలలాపాలన్నీఇక జాతీయ బ్యాంకులతోనే కలిసి పని చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తీర్మానించినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సర్కార్‌ పథకాలకు సంబంధించిన ప్రైవేటు, కో ఆపరేటివ్‌ బ్యాంకుల్లో తెరిచిన ఖాతాలన్నీ ఏప్రిల్‌ 1 నాటికి మూసేయాలని ఆదేశాల్లో జారీ చేసింది.

11 జాతీయ బ్యాంకుల్లో మాత్రమే ఉద్యోగాల జీతాలు, ఇతర అలవెన్స్‌ లు సర్కార్‌ బ్యాంకుల నుంచి మాత్రమే చెల్లించేలా చూసుకోవాలని ఆధికారులకు సూచించింది. పెన్షనర్లు తమ ఖాతాలను నేషనలైజ్డ్‌ బ్యాంకులకు మార్చుకోవాలని కూడా ఆదేశించింది.

ఇదిలాఉంటే ప్రైవేటు బ్యాంకులపై అనవసర ఆందోళనలు వద్దని, ప్రైవేటు బ్యాంకుల్లోని అకౌంట్లను రాష్ట్ర ప్రభుత్వాలు బదలాయించవద్దని ఆర్బీఐ గత గురువారం ఆయా రాష్ట్రాల చీఫ్‌ సెక్రెటరీలను కోరినప్పటికీ మహారాష్ట్ర సర్కార్‌ ఆర్బీఐ సూచనలను బేఖాతర్‌ చేసింది.

Next Story