వాహనదారులకు కేంద్రం షాక్: భారీగా పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..!

By సుభాష్  Published on  14 March 2020 4:37 AM GMT
వాహనదారులకు కేంద్రం షాక్: భారీగా పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..!

పెట్రోల్‌, డీజిల్‌ తగ్గిస్తూ వాహనదారులకు కాస్త ఊరట లభించగా, తాజాగా కేంద్రం షాకివ్వనుంది. కేంద్రం నిర్ణయంతో పెట్రోల్‌, డీజిల్‌పై రూ. 2 పెరగనుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. కానీ ధరలు తగ్గుడు ఏమోగాని.. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ పెంచింది. ఈ ఎక్సైజ్‌ సుంకం పెంపు నిర్ణయం మార్చి 14వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే మందగించడంతో ప్రభుత్వ ఆదాయం కూడా తగ్గిపోయింది.

ఇంకా ప్రస్తుతం కరోనా వైరస్‌ ఆర్థిక వ్యవస్థపై మరింత దెబ్బతీసింది. తాజాగా కేంద్ర నిర్ణయంతో దాదాపు రూ. 2వేల కోట్లు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా. ఇక మోదీ సర్కార్‌ నిర్ణయంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు లీటరుకు ఏకంగా రూ. 2 పెరిగేఅ వకాశాలున్నాయి. మొత్తం మీద వాహనదారులకు ఇది బ్యాడ్‌ న్యూస్‌ అనే చెప్పాలి.

కాగా, దేశీ ఇంధన ధరలు మరోసారి తగ్గాయి. పెట్రోల్‌ పై 14పైసలు, డీజిల్‌పై 17పైసలు తగ్గాయి. దీంతో హైదరాబాద్‌లో శనివారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.74.27, డీజిల్‌ ధర రూ.68.14కు చేరుకుంది. మరో వైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడంతో కేంద్రం వాహనదారులకు మరోలా భారం వేయనుంది.

Next Story