మైక్రోసాఫ్ట్ కు బిల్‌గేట్స్ రాజీనామా.. ఎందుకో తెలుసా?

By Newsmeter.Network  Published on  14 March 2020 3:39 AM GMT
మైక్రోసాఫ్ట్ కు బిల్‌గేట్స్ రాజీనామా.. ఎందుకో తెలుసా?

బిల్‌ గేట్స్‌.. ప్రపంచంలో ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారు వరకు బిల్‌ గేట్స్‌ ఎవరంటే ఠక్కున చెప్పేస్తారు. ప్రపంచ కుబేరుడు, మైక్రో సాఫ్ట్ ఫౌండర్‌ బిల్‌ గేట్స్‌ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మైక్రో సాఫ్ట్ సంస్థలకు రాజీనామా చేసి బోర్డు నుంచి వైదొలిగారు. ప్రస్తుతం బోర్డు సలహాదారుడిగా ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేశాడు. ఇకపై పూర్తిస్థాయిలో సామాజిక సేవలకు పరిమితమవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే 2014లో ఆయన మైక్రో సాఫ్ట్ చైర్మన్ స్థానం నుంచి వైదలగిన విషయం విధితమే. 2000లో సీఈవో పదవికి రాజీనామా చేసిన ఆయన 2008నుంచి ఫుల్‌టైం పనికికూడా గుడ్‌బై చెప్పారు. 1975లో మైక్రోసాఫ్ట్ ను ప్రారంభించిన ఆయన దాన్ని ప్రపంచ నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్లారు. సామాజిక బాధ్యతతో ప్రపంచ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను బిల్‌ గేట్స్‌ చేపట్టారు.

ఇదిలాఉంటే అభివృద్ధి, విద్య, పర్యావరణ మార్పులపై పోరుకోసం మరింత కృషి చేయాలని నిశ్చయించుకున్నట్లు బిల్‌గేట్స్‌ తెలిపారు. బెర్క్ షైర్‌ కంపెనీలు కానీ, మైక్రో సాఫ్ట్ కానీ ఎప్పుడూ లేనంత పటిష్ఠంగా ఉన్నాయని, కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడానికి ఇదే సరైన సమయం అని గేట్స్‌ పేర్కొన్నారు. ఇదిలాఉంటే బిల్‌ గేట్స్‌ సంస్థ ప్రస్తుత సీఈవో సత్య నాదెళ్లకు సాంకేతిక సహకారం అందించనున్నారు.

Next Story