సీఎం కేసీఆర్.. కుక్కానా.. మ‌జాక‌.!

By Medi Samrat  Published on  13 Oct 2019 8:31 AM GMT
సీఎం కేసీఆర్.. కుక్కానా.. మ‌జాక‌.!

సీఎం కేసీఆర్‌ నివాసం ప్రగతి భవన్‌లోని ఓ పెంపుడు కుక్క మృతి చెందింది. ఈ నెల 10న అనారోగ్యానికి గురైన 11 నెలల హస్కీ పరిస్థితి విషమించడంతో ప్రగతి భవన్‌ డాగ్స్‌ హ్యాండ్లర్‌ ఆసిఫ్‌ అలీఖాన్‌ గురువారం బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 4లోని యానిమల్‌ కేర్‌ క్లినిక్‌కు తీసుకెళ్లాడు. అయితే వైద్యుడు ట్రీట్‌మెంట్‌ చేస్తుండగానే కుక్క మృతి చెందింది. వైద్యుడి నిర్లక్ష్యంతోనే కుక్క మృతి చెందిందని ఆసిఫ్‌ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

అయితే.. సీఎం కేసీఆర్ పెంపుడు కుక్క మృతిపై మరిన్ని వివరాల కోసం జి. శ్రీనివాస్ రావు అనే వ్య‌క్తి ఎఫ్ఐఆర్ సర్టిఫికేట్ కోసం ఆర్టీఐను సంప్ర‌దించాడు. అయితే.. ఇందుకు ఆర్టీఐ సమాధానం ఆసక్తికరంగా ఉంది. కేసు ద‌ర్యాప్తులో వుందని.. క‌నుక ఎఫ్ఐఆర్ కాఫీ ఇవ్వ‌డం జ‌ర‌గ‌ద‌ని.. ఒక‌వేళ ఇస్తే అది ఆరోప‌ణ‌ల‌ను, ద‌ర్యాప్తును ప్ర‌భావితం చేస్తుంద‌ని స‌మాధానం ఇచ్చింది. అయితే ఈ స‌మాధానంపై నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్ లో కామెంట్లు చేస్తున్నారు.



Next Story