అటెండర్ కూతురు పెళ్లికి సీఎం 'కేసీఆర్'
By Medi Samrat Published on : 11 Nov 2019 2:20 PM IST

హైదరాబాద్: ప్రగతిభవన్‌లో పనిచేసే అటెండర్ లక్ష్మీనారాయణ కూతురు పెళ్లికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. ఈరోజు మియాపూర్‌లో జరుగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన సతీమణి శోభ కూడా ఈ పెళ్లికి హాజరుకానున్నారు. మరికొద్ది సేపట్లో మియాపూర్‌లో ఈ వివాహం జరగనుంది. ముఖ్యమంత్రి రాక సంధర్బంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు.
Next Story