పేషంట్‌ను తీసుకెళుతున్న ఓ అంబులెన్స్‌కు సీఎం జగన్‌ క్వానాయ్‌ దారి ఇచ్చింది. సీఎం జగన్.. వైఎస్ వర్థంతిలో పాల్గొని తిరిగి పులివెందుల నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి సీఎం బయల్దేరారు. అదే సమయంలో గూడవల్లి నిడమానూరు మధ్య రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని అంబులెన్స్ లో తరలిస్తున్నారు. ఇది గమనించిన సీఎం జగన్, అంబులెన్స్‌కు దారి ఇవ్వాలని సిబ్బందితో చెప్పారు. వెంటనే వారు దారి ఇచ్చారు. ఎలాంటి ఆటంకం లేకుండా అంబులెన్స్ ముందుకు కదిలింది.

ఉయ్యూరు నుంచి గన్నవరానికి బైక్‌ పై వెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌ కాలేజీ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా.. సీఎం కాన్వాయ్‌ పక్కకు జరిగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది. అంబులెన్స్‌కు దారి ఇవ్వడం కోసం జగన్ తన కాన్వాయ్‌ను నిలిపేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో గవర్నర్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొనడం కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన.. రాజ్‌భవన్ నుంచి బయటకు వెళ్తుండగా.. అంబులెన్స్ శబ్దం వినిపించింది. దీంతో అంబులెన్స్ వెళ్లిన తర్వాతే కాన్వాయ్‌లో బయల్దేరి వెళ్లారు.

తోట‌ వంశీ కుమార్‌

Next Story