గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో మరో సంచలనం.. 25 మంది పోలీసులకు క్లీన్‌చిట్
By సుభాష్ Published on 3 Oct 2020 4:10 PM ISTతెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. నయీం ఎన్‌కౌంటర్ తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 25 మంది పోలీసులకు క్లీన్‌చిట్ ఇచ్చింది. నయీంతో సంబంధాలున్నాయని భూ సెటిల్‌మెంట్, బెదిరింపు ఆరోపణలు ఎదుర్కొన్న 25 మంది పోలీసు అధికారులకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని తేల్చింది. అధికారులపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి ఆధారాలు లభించని కారణంగా వారందరి పేర్లను తొలగిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పోలీసు అధికారుల పాత్రపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాసిన లేఖకు సిట్ చీఫ్ నాగిరెడ్డి శనివారం సమాధానం ఇచ్చారు. కాగా, ఈ కేసులో సిట్ 175కుపైగా చార్జ్‌షీట్‌లను దాఖలు చేసిన విషయం తెలిసిందే. 130పైగా కేసుల్లో పోలీసులతో పాటు 8 మంది ప్రముఖ నాయకీయ నాయకుల పేర్లు కూడా ఉన్నాయి. ఇందులో ఇద్దరు అడిషనల్ ఎస్సీలతోపాటు మరో ఏగుడురు డీఎస్పీలు, 13 మంది సీఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు ఉన్నారు.
క్లీన్‌చిట్ పొందిన వారు..
అడిషనల్ ఎస్పీలు
శ్రీనివాస్, చంద్రశేఖర్
డీఎస్పీలు:
సిహెచ్. శ్రీనివాస్, ఎం. శ్రీనివాస్, మనోహర్, ప్రకాశ్, సాయి, ప్రకాశ్ రావు, తిరుపతన్న, అమరేందర్‌రెడ్డి, వెంకట నరసయ్య
ఎస్సైలు :
ఎస్.శ్రీనివాస్ కిషన్, వెంకటయ్య, రాజగోపాల్, మస్తాన్, వెంకట్‌రెడ్డి, వెంకట సూర్య ప్రకాశ్, రవి కిరణ్ రెడ్డి, బలవంతయ్య, నరేందర్ గౌడ్, రవీందర్ మజీద్.
కానిస్టేబుళ్లు :
బాలన్న, ఆనంద్ సదాత్‌మియా