జవాన్ల క్రిస్మస్ వేడుకలు

By అంజి  Published on  26 Dec 2019 2:57 AM GMT
జవాన్ల క్రిస్మస్ వేడుకలు

దేశ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మనం సుఖంగా, సంతోషంగా ఉండేందుకు తోడ్పడే సైనికులు క్రిస్మస్ వేడుకలు ఎలా చేసుకుంటున్నారో తెలుసా.. అసలే కాశ్మీరు నియంత్రణ రేఖ వద్ద వాతావరణం అనుకూలంగా ఉండదు. భారత సైనికుల సామర్ధ్యానికి, సహనానికీ ఎప్పుడూ పరీక్ష పెట్టే ప్రాంతం అది. అయితే అది జవాన్ల క్రిస్మస్‌ సంబరాలకు మాత్రం ఆటంకం కలిగించలేకపోయింది. డ్యూటీలో ఉన్న భారత సైనికులు క్రిస్మస్‌ వేడుకలను జరుపుకుంటున్న వీడియో ఇంటర్నెట్‌లో విడుదలైంది. దీనిలో 30 మందికి పైగా భారత్ సైనికుల బృందం భారీగా మంచుతో కప్పబడిన ప్రాంతంలో, ఒక హెలిపాడ్‌ సమీపంలో గడ్డకట్టించే చలిలో క్రీస్తు జననాన్ని పురస్కరించుకుని క్రిస్మస్‌ గీతం ‘జింగిల్‌ బెల్స్‌’ను పాడుతూ లయగా అడుగులు కదుపుతున్నారు. ఇద్దరు స్నోమేన్‌లను, చక్కగా అలంకరించిన క్రిస్మస్‌ ట్రీని, మంచుతో చేసిన ఖడ్గమృగం బొమ్మను కూడా ఈ వీడియోలో చూడవచ్చు. ఇందులో తెల్లని జాకెట్స్ వేసుకున్న సైనికులు జింగిల్ బెల్స్ పాడుతున్నారు. మధ్యలో ఒకరు శాంతా క్లాజ్ వేసుకుని డ్యాన్స్ చేస్తున్నారు.హృదయాలను కరిగించే ఈ వీడియోను చూసిన దేశప్రజలు ఫిదా అవుతున్నారు.



Next Story