ముందుగానే జాగ్రత్తపడ్డ మెగాస్టార్..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 July 2020 9:47 PM ISTమెగా స్టార్ చిరంజీవి లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియాలో బాగా అలరించారు. అభిమానుల కోసం వీడియోలు చేయడమే కాకుండా.. తన ఇంట్లో ఉన్న ఫోటోలను కూడా పెట్టుకుంటూ వస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి చెందిన ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మీసం లేకుండా.. క్లీన్ షేవ్ తో ఉన్న ఆయన ఫొటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 'ఆచార్య' చిత్రం కోసం ఆయనీ కొత్త గెటప్ లో కనిపిస్తున్నారని కూడా సోషల్ మీడియాలో బాగా ప్రచారం అవుతోంది.
ఈ రూమర్లు ఎన్నో ఊహాగానాలకు దారి తీస్తాయని భావించిన చిరంజీవి మీసం తీసేయడానికి సంబంధించిన క్లారిటీ ఇచ్చారు. మీసం తీసేయడంలో ఎలాంటి విశేషం లేదు.. ఏదో సరదా కోసం మీసం తీసేశానంతే.. ఈ లుక్ సినిమా కోసం మాత్రం కాదని చెప్పుకొచ్చారు చిరంజీవి. నిజం కంటే అబద్ధమే ఎక్కువ వైరల్ అవుతున్న తరుణంలో మెగా స్టార్ చిరంజీవి లుక్ విషయంలో సరైన క్లారిటీ ఇచ్చేశారు.
మెగా స్టార్ చిరంజీవి-కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా తెరకెక్కుతోంది. లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇక షూటింగ్ ను మళ్లీ మొదలుపెట్టాలని భావిస్తున్నప్పటికీ పెరుగుతున్న కరోనా కేసులు చిత్ర యూనిట్ ను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా చేస్తున్నట్లు చెబుతూ వస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ కూడా ఆర్.ఆర్.ఆర్. సినిమాను పూర్తీ చేయాల్సి ఉంది.