మరో అంటు వ్యాధిని చైనా ప్రపంచం మీదకు వదలబోతోందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 July 2020 5:54 AM GMT
మరో అంటు వ్యాధిని చైనా ప్రపంచం మీదకు వదలబోతోందా..?

కరోనా మహమ్మారిని ప్రపంచం మీదకు వదిలింది చైనా.. ఇప్పటికే అన్ని దేశాలు ఈ వైరస్ బారిన పడి ఎన్నో అవస్థలు పడుతూ ఉన్నాయి. ఇప్పుడు చైనా మరో ప్లేగు వ్యాధిని ప్రపంచం మీదకు వదలబోతోందా..? 'బుబోనిక్‌ ప్లేగు' ఉత్తర చైనాలో పురుడుపోసుకుందని స్థానిక మీడియా సంస్థలు తెలిపాయి. బయన్నూర్, ఇన్నర్ మంగోలియా అటానమస్ ప్రాంతంలో లెవెల్-3 వార్నింగ్ ను ఇచ్చారు.

శనివారం నాడు బయన్నూర్ ఆసుపత్రిలో ఓ రోగి ఈ ప్లేగు బారిన పడి ట్రీట్మెంట్ కోసం వచ్చినట్లు తెలుస్తోంది. ఒకరి నుండి మరొకరికి ఈ ప్లేగు సంక్రమించే అవకాశం ఉందని అక్కడి హెల్త్ విభాగం హెచ్చరికలు జారీ చేస్తోంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

జులై 1వ తేదీన జిన్ హువా న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం బుబోనిక్‌ ప్లేగు సంక్రమించాయనే అవకాశం ఉన్న రెండు కేసులు తెలిపింది. ఖొవ్డ్ ప్రావిన్స్ లోని పశ్చిమ మంగోలియా ప్రాంతంలో రెండు కేసులు నమోదయ్యాయని.. ల్యాబ్ టెస్టులు చేయగా బుబోనిక్‌ ప్లేగు సంక్రమించిందని తేలిందని కథనాన్ని ప్రచురించింది. 27 సంవత్సరాల వ్యక్తికి, అతడి సోదరుడైన 17 సంవత్సరాల వ్యక్తికి బుబోనిక్‌ ప్లేగు సంక్రమించింది. రెండు వేరు వేరు ఆసుపత్రుల్లో వారికి చికిత్స అందిస్తూ ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇద్దరు సోదరులు మర్మోట్ జంతువు మాంసం తినడంతో ఈ ప్లేగు వ్యాధి సంక్రమించిందని తెలుస్తోంది. ప్రజలు ఎవరూ మర్మోట్ జంతువు మాంసాన్ని తినకూడదంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వీరిద్దరూ కాంటాక్ట్ అయిన 146 మంది వ్యక్తులను ఐసోలేషన్ లో ఉంచారు.

బుబోనిక్‌ ప్లేగుకు గుమ్మడి పురుగులు వాహకాలుగా పనిచేస్తాయని అధికారులు తెలిపారు. ఆ పురుగులు మనుషులను కుట్టినప్పుడు వ్యాధి బారినపడతారని.. సరైన చికిత్స తీసుకోకపోతే 24 గంటల్లో చనిపోతారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది. గత ఏడాది ఓ జంట మర్మోట్ జంతువును తినడం వలన బుబోనిక్ ప్లేగు బారిన పడడంతో మరణించారు. పచ్చి మాంసం తినడం వలనే మంగోలియన్ ప్రావిన్స్ లోని జంట మరణించిందని అధికారులు స్పష్టం చేశారు. పందుల నుండి ఇన్ఫ్లుఎంజా వైరస్ సోకబోతోందని చైనీస్ రీసెర్చర్లు వెల్లడించిన కొద్ది రోజుల్లోనే బుబోనిక్ ప్లేగు గురించి కూడా అధికారులు వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇంకా ఎన్ని వైరస్ లను మనుషుల మీదకు చైనా వదులుతుందో అని అందరూ భయపడుతూ ఉన్నారు.

చైనా అగ్రికల్చరల్ యూనివర్సిటీ, చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సెంటర్ కు చెందిన శాస్త్రవేత్తలు, రీసెర్చర్లు పందుల వలన ఇన్ఫ్లుఎంజా వైరస్ సోకుతోందని గుర్తించారు. జెనోటైప్ 4 పందుల్లో ఉండడం కారణంగా ఇది మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఇన్ఫ్లుఎంజా వైరస్ లో మరిన్ని మార్పులు వచ్చి.. ఒక మనిషి నుండి మరో మనిషికి సంక్రమించే అవకాశం ఉందని, మరో వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసే అవకాశం ఉందని బిబిసి రిపోర్ట్ చేసింది. పందుల్లో ఈ వైరస్ లక్షణాలను వీలైనంత త్వరగా గుర్తుంచి, పందుల పెంపకం చేస్తున్న కేంద్రాల్లో పనిచేస్తున్న మనుషులపై కూడా నిఘా ఉంచాలని చైనాకు చెందిన శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. గత ఏడాది డిసెంబర్ లో కరోనా మొదటి కేసు చైనాలో నమోదయ్యింది. చైనా ఎలాగోలా ఈ వైరస్ ను కట్టడి చేయగలిగింది.. ఇప్పుడు మరో వైరస్ చైనాలో పుట్టడం హాట్ టాపిక్ అయింది. శనివారం నాడు చైనాలో కేవలం సింగిల్ డిజిట్ కరోనా కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.

Next Story