ఇంట్లో పులి దూరింది.. బాలుడిని లాక్కెళ్లి చంపేసింది

By సుభాష్
Published on : 10 May 2020 10:47 PM IST

ఇంట్లో పులి దూరింది.. బాలుడిని లాక్కెళ్లి చంపేసింది

కర్ణాటక రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో చిరుతపులి చొరబడి బాలుడిని లాక్కెళ్లి చంపేసింది. ఈ ఘటన రామనగర జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాగడి తాలుకా కదరయ్యనపాళ్య గ్రామానికి చెందిన మంగళగౌరయ్య, చంద్రప్ప దంపతులకు హేమంత్‌ (3) కుమారుడున్నాడు. వేసవి కాలం కావడంతో ఉక్కపోత కారణంగా తలుపులు తెరిచి పడుకున్నారు.

శుక్రవారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో అర్థరాత్రి చిరుతపులి ఇంట్లో దూరింది. నిద్రిస్తున్న బాలుడిని గుట్టుచప్పుడు కాకుండా నోట కరుచుకుని లాక్కెళ్లింది. తెల్లవారుజామున ఇంటికి చాలా దూరంగా పొదల్లో బాలుడి మృతదేహం లభించిందని బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడిని చిరుతనే చంపేసినట్లు గుర్తించారు. మూడేళ్ల బాలుడిని చంపేయడంపై తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Next Story