ఆ 17మంది గిరిపుత్రులను బలి తీసుకుంది పోలీసులే..!
By Newsmeter.Network Published on 4 Dec 2019 3:40 PM ISTమావోయిస్టులను నియంత్రించే కార్యక్రమలో భాగంగా పోలీసులు 17 మందిని కాల్చివేసిన దుర్ఘటన 2012 జూన్ 28 న చత్తీసుగఢ్ లోని సర్కేగూడ ప్రాంతంలో జరిగింది. ఈ దుర్ఘటన పై ఆ సమయంలో పెను దుమారం రేగింది. అయితే అప్పటి ప్రభుత్వం ఈ విషయం పై విచారణకు కమిటీని నియమించినది. విచారణలో అసలు విషయాలు బయటపడ్డయి. అయితే ఎన్‌కౌంటర్ లో చనిపోయింది అమాయక గిరిజనులని తేలింది.
జస్టిస్ విజయకుమార్ ఆద్వర్యంలోని జ్యూడిషియల్ కమిటీ నివేదిక.. సర్కేగూడ గ్రామస్తులు బీజ్ పందుమ్ పండుగ గురుంచి మాట్లాడుకోవడం కోసం ఆ నాటి రాత్రి సమావేశం అయినట్లు తెలిపారు. ఈ క్రమంలో అక్కడ సమావేశం అయినది మావోయిస్టులుగా భావించి వారి పై కాల్పులు జరిపారని నివేదికలో సూచించారు. ఈ విషయంలో అప్పటి పోలీసులు.. గ్రామస్తులే మొదట మాపై కాల్పులు జరిపారని.. అందువల్లనే మేము కాల్పులు జరిపామని తెలిపారు.
అయితే గ్రామస్తుల దగ్గర ఎటువంటి ఆయుధాలు గాని వాటికీ సంబందించి ఎటువంటి ఆధారాలు లేనట్లు కమిటీ తెలిపింది. ఈ విషయంగా ఎన్‌కౌంటర్ సమయంలో అక్కడే ఉన్న డిఐజి ఎలాంగో ని కమిటీ విచారించగా.. సమావేశం జరిగిన ప్రాంతం నుండి ఎలాంటి కాల్పులు రాలేదని తెలిపారు. ముందుగా పోలీసులే కాల్పులు జరిపారని చెప్పారు. ఈ విషయంలో పోలీసులు వారికీ అందిన సమాచారం బట్టి పొరపాటున కాల్పులు జరిపినట్లుగా కమిటీ విచారణలో తెలిపింది.
జస్టిస్ అగర్వాల్ కమిటీ నివేదికను శనివారం రాత్రి క్యాబినెట్ సమావేశం లో ఉంచడం జరిగింది. ఈ విషయంగా ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీలు విమర్శించుకోవడం మొదలుపెట్టారు. అదేవిధంగా బాధితుల తరుపున వాదిస్తున్న న్యాయవాది ఈషా ఖండేల్వాల్ ఈ నివేదికను సోషల్ మీడియా మాధ్యమాలలో చూసాను అని చెప్పారు.