వెటర్నరీ వైద్యురాలిపై జరిగిన అఘాయిత్యం మరువకముందే మరెన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్న అత్యాచారాలు, హత్యలు, మానభంగాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా…మానవమృగాలు రెచ్చిపోతూనే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటనలపై తీవ్రంగా ఖండిస్తూ… నిందితులకు తక్షణమే ఉరి శిక్ష అమలయ్యేలా చర్యలు చేపట్టాలని గగ్గోలు పెడుతుంటే …. తాజాగా ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోచోటు చేసుకున్న మరో ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ గిరిజన బాలికపై ఆర్‌ఎంపీవైద్యుడు అత్యాచారయత్నానికి పాల్పడటం సంచలనంగామారింది.

మండలంలోని జులైవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓ బాలిక 8వ తరగతి చదువుతోంది. అక్కడే పాఠశాలకు దగ్గరలో ఉన్న ఎస్టీ హాస్టల్‌లో ఉంటోంది. గతనెల 28న బాధిత విద్యార్థినికి కంటిపై కురుపు రావడంతో చికిత్స కోసం ఆర్‌ఎంపీ వైద్యుడు రాజు వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో రాజు బాలికకు మత్తు మందు ఇచ్చి ఒంటిపై ఉన్న వస్త్రాలు విప్పి అసభ్యకరంగా ప్రవర్తించి అత్యాచారయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో బాధితురాలు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలుపడంతో అసలు విషయం బయటకు వచ్చింది. పాఠశాలకు, హాస్టల్‌కు మధ్య ఉన్న యశ్వంత్‌ క్లినిక్‌లో ఆర్‌ఎంపీ రాజు మెడికల్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న రాజు ఈ ఘటనకు పాల్పడటంతో బాధిత కుటుంబ సభ్యులు సుబేదారి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు…  నిందితుడు రాజుపై ఐపీసీ 354, 509 సెక్షన్లతో  పాటు ఎస్సీ, ఎస్టీ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేషనప్త్తి్తవిచారణ చేపట్టారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.