ఆ పిల్ల ఏడుస్తుంటే చేతికున్న వెంట్రుకలు లేచి నిలుచున్నాయి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Sept 2020 1:07 PM IST
ఆ పిల్ల ఏడుస్తుంటే చేతికున్న వెంట్రుకలు లేచి నిలుచున్నాయి

'Rx 100' సినిమాతో యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తీకేయ. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ''చావు కబురు చల్లగా''. కార్తీకేయ సరసన లావ‌ణ్య త్రిపాఠి నటిస్తోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా పెగళ్ళపాటి కౌశిక్ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌ కు పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో కార్తికేయ 'బస్తీ బాలరాజు' పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌ లుక్ విడుదలై విశేషంగా ఆకట్టుకుంది. నేడు కార్తికేయ పుట్టినరోజు కానుకగా 'చావు కబురు చల్లగా' టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

ఈ టీజర్‌లో ఏం చూపించారంటే..? ఫోన్ కాల్ తో నిద్ర లేస్తాడు హీరో. 'మా బంధువొకరు చనిపోయారు.. స్మశానానికి తీసుకెళ్లాలి.. మేం దేవుడి బిడ్డలం. మరి మీరు మా వాళ్ళను తీసుకెళ్తారా?' అని అడుగగా.. 'డబ్బులిత్తే ఎవరి బిడ్డలనన్నా తీసుకెళ్లామ్.. అడ్రెస్ చెప్పండి' అని కార్తికేయ సమాధానం చెప్తాడు. దీనిని బట్టి ఈ మూవీలో హీరో వ్యాన్ లో స్మశానానికి శవాలను తీసుకెళ్లే పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. 'నేను రోజూ సావులకు బోతా.. దీనమ్మ అందరి ఏడుపులు చూసి చూసి ఏడుపంటేనే సిరాకు దొబ్బింది.. కానీ ఆ పిల్ల ఏడుత్తుంటే మాత్రం.. చేతికున్న ఎంట్రుకలు ఇట్టా లెగిసి నిలుచున్నాయిరా' అని కార్తీకేయ. 'ఎదవ నాయాలా.. శవాన్ని తోలుకుపోరా అంటే.. మొగుడు పోయిన దాన్ని కెలికొచ్చాడు' అంటూ ఆమని హీరోను తిడుతుంది. దీనికి 'ఆడెట్టా పోయాడు కదే.. ఇప్పుడది ఖాళీనే' అంటూ హీరో చెప్పడం నవ్వు తెప్పిస్తోంది.

Next Story