మరోసారి తెలంగాణకు కేంద్ర బృందం
By సుభాష్ Published on 26 Jun 2020 8:14 AM ISTతెలంగాణలో కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతోంది. లాక్‌డౌన్‌కు ముందు వందలోపే నమోదయ్యే కేసులు ఇప్పుడు ఏకంగా వెయ్యికి చేరువలో నమోదవుతున్నాయి. దీంతో మరోసారి కేంద్ర బృందం హైదరాబాద్‌కు రానుంది. దేశంలో కరోనా పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటోంది. ప్రతి రోజు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కరోనాకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తుంటే. మరి కొన్ని సందర్భాల్లో కేంద్ర బృందాలను పంపిపూర్తి స్థాయిలో నివేదిక తెప్పించుకుంటోంది. ప్రతిరోజు నివేదికలకంటే అప్పుడప్పుడు కేంద్ర బృందాలను రాష్ట్రాలకు పంపి జరుగుతున్న పరిస్థితులపై పరిశీలించేందుకు బృందాలు రానున్నాయి. కరోనా నియంత్రణపై సమీక్షకు నాలుగోసారి కేంద్ర బృందం రానుంది.
ఇక కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై అంచనా వేయనున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌తో పాటు కరోనా అధికంగా ఉన్న జిల్లాల్లో పర్యటించనుంది.
కరోనా నియంత్రణపై అధికారులతో సమీక్ష
హైదరాబాద్‌కు రానున్న కేంద్ర బృందం కరోనా నియంత్రణపై తెలంగాణ రాష్ట్ర అధికారులతో సమీక్ష నిర్వహించనుంది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన కీలక సూచనలు చేయనుంది. మార్చి నెలలో కరనా వైరస్ ప్రభావం మొదలైనప్పటి నుంచి రాష్ట్రాలకు పలు కీలక సూచనలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న లవ్ అగర్వాల్.. తాజా పరిస్థితులపై రాష్ట్ర అధికారులకు మరిన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే నేరుగా బృందాన్ని రాష్ట్రానికి పంపి సమాలోచనలు జరపాలని నిర్ణయించారు. అందుకే మూడు కీలక రాష్ట్రాలకు తానే స్వయంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బృందాల పర్యటనలో భాగంగా తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, మహారాష్ట్రలో పర్యటించనున్నారు.