నిబంధనల్ని ఉల్లంఘిస్తే జైలుకే..లాక్ డౌన్ పై కేంద్రం సీరియస్
By రాణి
లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా కష్టకాలంలో ఏ పని లేకుండా..ఇంట్లో ఉండలేక ఊరికే అలా రోడ్లపై బైక్ లు, కార్లేసుకుని తిరిగేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ విధిస్తే..నిబంధనలు ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది.
Also Read : మూడు రోజుల శిశువుకు కరోనా పాజిటివ్
లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి అనవసరంగా రోడ్లపై తిరిగేవారికి రెండేళ్ల జైలు శిక్ష విధించవచ్చని కేంద్రం సూచించింది. విపత్తు యాజమాన్య చట్టం, ఐపీసీ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలకు లేఖ రాశారు. లాక్ డౌన్ నిబంధనల్లో ఏ నిబంధన ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలో అజయ్ లేఖలో వివరించారు. ఈ లేఖను రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపించారు.
Also Read : పోలీస్ స్టేషన్ ఆవరణలో యువకుడి ఆత్మహత్య