పోలీస్ స్టేషన్ ఆవరణలో యువకుడి ఆత్మహత్య

By రాణి  Published on  2 April 2020 1:00 PM GMT
పోలీస్ స్టేషన్ ఆవరణలో యువకుడి ఆత్మహత్య

దేశంలో లాక్ డౌన్ తో ఎక్కడికక్కడ ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థ స్తంభించిపోయింది. మరో 12 రోజుల వరకూ ఇదే పరిస్థితి ఉంటుంది. దీంతో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఉపాధి కోసం వెళ్లిన వలస కూలీలు, ఉద్యోగస్తులంతా అక్కడ ఉండలేక కాలినడకనే సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు. ఇదే బాటలో తిరుపతిలో ఉద్యోగం చేస్తున్న యువకుడు కూడా కాలినడకన సొంతఊరికి బయల్దేరాడు. అంతలోనే అడ్డుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి బాపట్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. మనస్తాపం చెందిన యువకుడు స్టేషన్ ఆవరణలోనే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నా చావుకి కారణం పోలీసులేనంటూ సెల్ఫీ వీడియో తీసి తన స్నేహితులకు పంపడంతో విషయం వెలుగు చూసింది.

Also Read : అలాంటి వారు సమాజానికే భారం : కేటీఆర్

కృష్ణాజిల్లా కైకలూరు కు చెందిన శ్రీనివాస్ ఉద్యోగ రీత్యా తిరుపతిలో ఉంటున్నాడు. లాక్ డౌన్ కారణంగా అక్కడ ఉద్యోగానికి సెలవులివ్వడంతో ఎలాగైనా సొంతఊరికి చేరాలనుకున్నాడు. కాలినడకన ఊరికి బయల్దేరాడు. కాలినడకన గుంటూరు వైపు వస్తున్న అతడిని వెదురుమల్లి పోలీసులు అడ్డుకుని ఎక్కడికి వెళ్తున్నావని ప్రశ్నించారు. సొంతఊరికి నడుచుకుంటూ వెళ్తున్నానని చెప్పగా వెంటనే అరెస్ట్ చేసి బాపట్ల పీఎస్ కు తరలించారు. మనస్తాపం చెందిన శ్రీనివాస్ తన చావుకి కారణమేంటో చెప్తూ వీడియో తీసి స్నేహితులకు పంపి ఉరేసుకున్నాడు.

Also Read : పొలంలో వెండి నాణేలు..విషయం బయటికి రావడంతో..

'' చూడండి ఫ్రెండ్స్..నన్నిలా వదిలేసి వెళ్లిపోయారు. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు వెదురుమల్లి నన్ను అరెస్ట్ చేసి బాపట్ల పోలీస్ స్టేషన్ లో వదిలేశారు. కేసు ఫైల్ చేశారు. ఇంతవరకూ ఎటువంటి రియాక్షన్ లేదు. ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. నా చావుకి కారణం వెదురుమల్లి పోలీసులే ''.

ఇలా శ్రీనివాస్ ఒక్కడే కాదు..వెలుగులోకి రాని చాలా ఘటనలున్నాయి. కాలినడకన వెళ్తూ ఆకలికి తట్టుకోలేక చిన్నారులు కూడా మరణిస్తున్నారు. కరోనా వైరస్ వచ్చి చనిపోయే వారి సంఖ్య కన్నా..వైరస్ రాకుండానే సొంతఊరికెళ్లేందుకు నానా అవస్థలూ పడుతూ చనిపోయే వారి సంఖ్యే ఎక్కువగా ఉంది.

[video width="640" height="352" mp4="https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/04/WhatsApp-Video-2020-04-02-at-5.59.23-PM.mp4"][/video]

Next Story