పొలంలో వెండి నాణేలు..విషయం బయటికి రావడంతో..

By రాణి  Published on  2 April 2020 9:50 AM GMT
పొలంలో వెండి నాణేలు..విషయం బయటికి రావడంతో..

అదృష్టం వెండి నాణేల రూపంలో వస్తే..దురదృష్టం పోలీసుల రూపంలో ప్రత్యక్షమై వాటన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఎల్మకన్నెలో గ్రామ సహకార సంఘం డైరెక్టర్ వెంకట్రామరెడ్డి తన పొలాన్ని చదును చేయిస్తుండగా..వెండి నాణేలు దొరికాయి. వీటిని పొలం యజమానితో పాటు అక్కడున్న వారు కూడా ఆ నాణేలను తీసుకెళ్లారు. ఆ నోటా ఈ నోటా ఈ విషయం పాకి పోలీసుల వరకూ చేరింది. దీంతో పోలీసులు 141 వెండి నాణేలను స్వాధీనం చేసుకున్నారు.

Also Read : అలాంటి వారు సమాజానికే భారం : కేటీఆర్

పూర్వకాలంలో రాజులు తమ సొత్తును అంటే వజ్ర వైఢూర్యాలను, మణులను బిందెలలో వేసి, వాటికి నాగబంధం వేసి భూమిలో పాతిపెట్టేవారట. అవే ఇప్పుడు అక్కడక్కడా రైతుల భూముల్లో లంకె బిందుల్లా లభ్యమవుతున్నాయి. ఒక్కప్పటి రాజుల సొమ్ము కాబట్టి..అదంతా ప్రభుత్వానికే చెందుతుంది.

Next Story