లాక్‌డౌన్‌పై కేంద్రం సీరియస్
By సుభాష్Published on : 20 April 2020 2:24 PM IST

కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. అయితే లాక్‌డౌన్‌లు పలు రాష్ట్రాల్లో సరిగ్గా అమలు చేయకపోవడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యవసరం కాని సేవలకు కూడా సడలించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. లాక్‌డౌన్ నిబంధనలు కఠినతరం చేయకపోవడంతో కరోనా మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరిస్తోంది.
Also Read
సీఎం యోగి ఆదిత్యానాథ్కు పితృవియోగంఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్రం హోంశాఖ లేఖ రాసింది. తక్షణమే రాష్ట్రాల్లో లాక్‌డౌన్ రూల్స్ కఠినతరం చేయాలని ఆదేశించింది.
కాగా, ఇప్పటికే కొన్ని రాష్ట్రాల నిర్లక్ష్యం కారణంగా లాక్‌డౌన్ కఠినంగా అమలు కావడం లేదని, దీంతో వాహనదారులు భారీగా రోడ్లపైకి వస్తున్నారని పేర్కొంది. కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని సూచించింది.
Next Story