ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ తండ్రి ఆనంద్‌ సింగ్‌ (90) కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం మరణించారు.

మార్చి 15న తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. క్రమ క్రమంగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఆనంద్‌సింగ్‌ మృతి పట్ల పలువురు ప్రముఖులు, జాతీయ నేతలు విచారం వ్యక్తం చేశారు

 

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.