దుండగుడి కాల్పులు.. 16 మంది మృతి

By సుభాష్  Published on  20 April 2020 6:13 AM GMT
దుండగుడి కాల్పులు.. 16 మంది మృతి

ప్రపచంలో ఒక వైపు కరోనా వైరస్‌పై పోరాటం జరుగుతుంటే మరో వైపు దుండగుడు రెచ్చిపోయారు. కెనడాలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 16 మంది మృతి చెందారు. ఆదివారం నోవా స్కోటియా రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ కాల్పులతో అప్రమత్తమై పోలీసులు కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. కాగా, దుండగుడు జరిపిన కాల్పుల్లో ఓ మహిళ పోలీసు కూడా ఉంది. దుండగుడు పోలీసుల దుస్తులు ధరించి, పోలీసులు వాడే వాహనం లాగా తయారు చేసి కాల్పులకు తెగబడినట్లు అధికారులు తెలిపారు.

గత 30 ఏళ్ల కెనడా చరిత్రలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం మొదటిసారి అని చెబుతున్నారు. కాగా, 1989లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 14 మంది మరణించారు. అప్పటి నుంచి తుపాకుల వాడకంపై కఠిన ఆంక్షలు విధించారు. ఇప్పుడు మరోసారి ఇలాంటి ఘటన జరగడంపై సంచలనం రేపుతోంది.

కాగా, కెనడాలో కరోనా వైరస్‌ ఉండటంతో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. దీంతో ప్రజలెవ్వరూ బయటకు రాకుండా అక్కడి పోలీసు యంత్రాంగం చర్యలు చేపడుతోంది.

Next Story
Share it