మ‌హిళ‌పైకి కారు ఎక్కించిన డ్రైవ‌ర్‌.. వీడియో వైర‌ల్.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Aug 2020 12:16 PM GMT
మ‌హిళ‌పైకి కారు ఎక్కించిన డ్రైవ‌ర్‌.. వీడియో వైర‌ల్.!

కర్ణాటకలోని మంగుళూరులో ఓ మహిళ మృత్యువు దాకా వెళ్లి కొద్దిలో ప్రాణాలతో బయటపడింది. వాణిశ్రీ అనే మహిళ కాద్రి కంబ్లా జంక్షన్ మీదుగా స్కూటీపై‌ వెళ్తుంది. నాలుగు రోడ్ల కూడ‌లి కావ‌డం.. సిగ్న‌ల్ వంటివి లేక‌పోవ‌డంతో అటుగా వ‌స్తున్న‌ కారు వాణిశ్రీ స్కూటీని ఢీకొట్టింది. దీంతో ఆమె ఎగిరి కారు బానెట్‌పై పడి.. అక్కడి నుంచి కింద పడింది.

అయితే కారు డ్రైవర్‌ అదేమీ ప‌ట్టించుకోకుండా.. కారుని అలానే ముందుకు పోనిచ్చాడు. దాంతో కారు ఆమె మీదకి ఎక్కింది. అయితే, రోడ్డు పక్కన ఉన్న స్థానికులు వెంటనే అప్రమత్తమై కారును లేపి మ‌హిళ‌ను బ‌య‌ట‌కు తీయ‌డంతో ప్రాణాపాయం తప్పింది. అప్ప‌టికే కొంత‌మంది కారు మీద పంచుల వ‌ర్షం కురిపించారు.

స్థానికులు కారుని పెకెత్తి మహిళను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. వాణిశ్రీకి ఎలాంటి అపాయం లేదని, చిన్న గాయాలే తగిలాయని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. కారుడ్రైవ‌ర్ తీరుపై నెటిజ‌న్లు మండిప‌డుతు‌న్నారు.

Next Story
Share it