కేంద్రం కీలక నిర్ణయం: CBSE టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు రద్దు

By సుభాష్  Published on  29 April 2020 3:33 AM GMT
కేంద్రం కీలక నిర్ణయం: CBSE టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు రద్దు

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులకు మేలు జరగనుందనే చెప్పాలి. పెండింగ్‌లో ఉన్న సీబీఎస్‌ఈ బోర్డకు సంబంధించిన పదో తరగతి, ఇంటరర్‌ సెకండియర్‌ పరీక్షలను నిర్వహించే అవకాశం లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ పరీక్షలు రాయని విద్యార్థులు అంతకు ముందు ఏడాది రాసిన పరీక్షల్లో వచ్చిన మార్కులను బట్టి, తదుపరి తరగతులకు వెళ్లేది, లేనిది నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. అయితే పరీక్షలు రద్దు నిర్ణయంపై తుది నిర్ణయం రాష్ట్రాలకే వదిలేసింది. ఆయా రాష్ట్రాల్లో బోర్డులు దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నాయి.

సీబీఎస్‌ఈ పదో తరగతి, ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలను మార్చిలో వాయిదా వేసింది. అప్పటికే దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడంతో ఆ నిర్ణయం తీసుకుంది. తాజాగా రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో కేంద్ర హెఆర్‌డీ మత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వచ్చే ఏడాది జేఈఈ, ఎన్‌ఈఈటీ, ఎంట్రన్స్‌ టెస్ట్‌ సిలబస్‌ను 30శాతం తగ్గించనున్నట్లు పేర్కొన్నారు.

కాగా, అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే జరిగిన పరీక్షల జవాబు పత్రాల షీట్లకు వాల్యూయేషన్‌ ప్రారంభించాలన్నారు. ప్రతీ ఏడాది లాగే షెడ్యూల్‌ సమయానికి ఫలితాలు ప్రకటించేందుకు ప్రయత్నించాలని కోరారు.

Next Story