నేడు భూమివైపు దూసుకొస్తున్న భారీ గ్రహ శకలం.. ప్రమాదం ఉందా..?

By సుభాష్  Published on  29 April 2020 1:55 AM GMT
నేడు భూమివైపు దూసుకొస్తున్న భారీ గ్రహ శకలం.. ప్రమాదం ఉందా..?

అప్పుడప్పుడు అంతరిక్షం నుంచి గ్రహశకలాలు భూమిపైకి రావడం సహజం. తాజాగా 1.5కిలోమీటర్ల పొడవుగల ఓ గ్రహశకలం ఈ రోజు భూమివైపు దూసుకొస్తోంది. ఈ గ్రహశకలం వల్ల ఇప్పుడే కాదు కొన్ని సంవత్సారాల తర్వాత కూడా భూమికి ఎలాంటి నష్టం ఉండదని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపింది. ఇప్పుడి శకలం ఏప్రిల్‌ 29న మధ్యాహ్నం 3:26 గంటలకు భూమి వైపు వెళ్లనుంది. అయితే భూమికి సమీపంలో వచ్చిన సమయంలో ఇది మనకు 39 లక్షల మైళ్ల దూరం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే భూమి, చంద్రుని మధ్య ఎంత దూరం ఉంటుందో, అంతకు 16 రేట్లు ఎక్కువ దూరం. అందు వల్ల భూమిని ఢీకొట్టే అవకాశాలు ఉండవంటున్నారు.

గంటకు 31319 కిలోమీటర్ల వేగంతో..

ఈ ప్రస్తుతం ఈ గ్రహశకలం గంటకు 31319 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. అంటే నిమిషానికి 521 కిలోమీటర్ల దూరంతో దూసుకొస్తుంది. ఇంత వేగంగా దూసుకొస్తున్న ఓ భారీ శకలం భూమిని ఢీకొంటే జరిగే నష్టం అంతా ఇంతా కాదు. అందుకే నాసా ఈ గ్రహశకలాన్ని పదేపదే గమనిస్తోంది. ఈ మధ్య భూమిపై ఇంత పెద్ద గ్రహశకలం రాలేదట. కాగా, ప్రస్తుతం కక్ష్యా మార్గంలో ఇలాంటివి ఇప్పటి వరకు 125 గ్రహశకలాలను గుర్తించింది నాసా. దీనికి 1998 ఓఆర్‌2 అనే పేరు ఉంది. ఎందుకంటే ఇది మొదటిసారిగా 1998లో కనిపించింది.

A Big Asteroid Will Fly By Earth1

ప్యూర్టోరికోలోని అరెసిబో అబ్జర్వేటరీ ఈ గ్రహ శకలాన్ని ఫోటో తీసింది. ముఖానికి ఎన్‌-95 మాస్క్‌ ధరించినట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడు ఆ ఫోటో తెగ వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండటంతో సోషల్ డిస్టెన్స్‌ పాటిస్తున్నాము. ఇక భూమి వైపు వస్తున్న శకలం కాబట్టి ఆ గ్రహ శకలం కూడా ఫేస్‌ మాస్క్‌ పెట్టుకుందని కామెంట్లు చేసుకుంటున్నారు.

Asteroid 1998 Or2





Next Story