కర్నూలు : జిల్లాలోని నందికోట్కూరు నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నియోజకవర్గంలోని పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో వైసీపీ యువ నాయకుడు, వైసీపీ నందికోట్కూరు ఇంచార్జ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనుచరుల మధ్య ఘర్షణ జరిగింది.
ఈ దాడిలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనుచరులు కరీం బాషా, జలీల్‌లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ బైరెడ్డి అనుచరులను వైద్యం కోసం నందికొట్కూరు ఆసుపత్రికి తరలిస్తుండగా.. సిద్ధార్థ రెడ్డి వర్గీయులు కారును ధ్వంసం చేశారు. దీంతో ముచ్చుమర్రి గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ముచ్చుమర్రికి చేరుకున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.