రేపటి నుంచి ఏపీఎస్‌ ఆర్టీసీ సర్వీసులు

By సుభాష్  Published on  20 May 2020 2:48 AM GMT
రేపటి నుంచి ఏపీఎస్‌ ఆర్టీసీ సర్వీసులు

ఏపీలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నా.. ప్రభుత్వం మాత్రం లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు ఇస్తోంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. మార్చి 22 నుంచి డిపోలకే పరిమితమైన బస్సులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు ఇవ్వడంతో బస్సులను రోడ్డెక్కించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మే 21 నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ఆర్‌ఎంలకు బస్సులను తప్పేందుకు సిద్దం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే బస్సుల్లో ఎక్కే ప్రయాణికులు సామాజిక దూరం పాటించేలా బస్సుల్లో ప్రత్యేక సీటింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

అయితే బస్సులు ఎక్కడి నుంచి ఎక్కడికి నడపాలనేది ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాల మధ్య బస్సులను ముందుగా నడపాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. విజయవాడ, విశాఖ, తిరుపతితో పాటు ప్రధాన నగరాలకు నడపనున్నట్లు తెలుస్తోంది. ప్రతీ జిల్లా కేంద్రాన్ని మరో జిల్లా కేంద్రంతో కలిపేలా బస్పులు నడిపేలా చర్యలు చేపడుతున్నారు. దీంతో జిల్లా కేంద్రాల మధ్య బస్సు సర్వీసులపే నడిపేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Next Story
Share it