జొమాటోలో కూడా లక్షలు గెలుచుకోవచ్చట.. ఆ ట్యాలెంట్ మీకుందా..?
Zomato will reward nearly Rs 3 lakh to find a bug in its website, apps. ప్రముఖ కంపెనీలు ప్రవేశ పెట్టే యాప్స్ లో కొన్ని సార్లు బగ్స్
By Medi Samrat Published on 9 July 2021 5:20 PM ISTటెక్నాలజీ రిసెర్చర్లు, ఎథికల్ హ్యాకర్లకు జోమాటో ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ ప్లాట్‌ఫాంకు నష్టం చేకూర్చే ఏదైనా బగ్‌ను కనుగొన్న వారికి ఇస్తున్న బహుమతిని పెంచింది. దీనికి సంబంధించిన వివరాలను సంస్థ జూలై 8న అధికారికంగా వెల్లడించింది. ఇప్పుడు బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌లో భాగంగా సంస్థకు చెందిన యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఏదైనా హానికరమైన బగ్‌ను కనుగొన్న వారు అత్యధికంగా 4,000 డాలర్లు (దాదాపు రూ.3 లక్షలు) గెలుచుకోవచ్చు. "జోమాటో బగ్ బౌంటీ ప్రోగ్రామ్.. మా ప్లాట్‌ఫాం సెక్యూరిటీ వ్యవస్థలో కీలక భాగం. మేం ఇస్తున్న ఈ ఆఫర్ హ్యాకర్ కమ్యూనిటీని మరింత ప్రేరేపిస్తుందని ఆశిస్తున్నాం. ఇప్పటివరకు ఈ ప్రోగ్రాం కోసం మీరు చేసిన కృషికి ధన్యవాదాలు. మీరు అందించే బగ్ రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నాం" అని జొమాటో అధికారికంగా ప్రకటించింది. బగ్స్ తీవ్రతను బట్టి, బహుమతి రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయల వరకూ ఉంటుందని జొమాటో సెక్యూరిటీ ఇంజనీర్ యష్ సోధా ట్వీట్ చేశారు. మరిన్ని వివరాలకు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సోధా కోరారు.