జొమాటో సంస్థ ఆహార ప్రియుల కోసం 10 నిమిషాలలోనే ఫుడ్ డెలివరీ సేవను ప్రకటించింది. జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ ఈ కొత్త ఫీచర్‌ను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. "జొమాటోలో 10 నిమిషాల ఫుడ్ డెలివరీ త్వరలో వస్తుంది" అని ట్వీట్ చేశారు. 10 నిమిషాల ఫుడ్ డెలివరీ ఆఫర్‌ను Zomato ఇన్‌స్టంట్ అని చెప్పుకొచ్చారు.
గోయల్, తన ట్వీట్‌తో పాటు, Zomato యొక్క అధికారిక బ్లాగ్ పోస్ట్‌కు లింక్‌ను పంచుకున్నారు. "మేము ఆహారాన్ని వేగంగా డెలివరీ చేయమని డెలివరీ భాగస్వాములపై ఎలాంటి ఒత్తిడి చేయము. అలాగే డెలివరీ పార్ట్‌నర్‌లకు ఆలస్యమైన డెలివరీలకు జరిమానా విధించము. డెలివరీ భాగస్వాములకు వాగ్దానం చేయబడిన డెలివరీ సమయం గురించి తెలియజేయబడదు." అని ఆయన అన్నారు. 10 నిమిషాల డెలివరీ పేరుతో డెలివరీ బాయ్స్‌పై ఒత్తిడి పెట్టాలని తమ కంపెనీ అనుకోవట్లేదని జొమాటో తెలిపింది.
జొమాటో సీఈవో దీపెందర్ గోయల్ ట్విట్టర్ ఖాతాలో జొమాటో ఇన్‌స్టంట్ గురించి ప్రకటించారు. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా ఈ ఫీచర్‌పై విరుచుకుపడుతున్నారు. ఫుడ్ క్వాలిటీ 10కి 10, డెలివరీ పార్ట్‌నర్ సేఫ్టీ 10కి 10, డెలివరీ టైమ్ 10.. అంటూ జొమాటో సీఈవో ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ ప్రకటనపై రియాక్షన్స్ ను మీరు కూడా చూడవచ్చు.