బంగారం ధరలకు రెక్కలు..హైదరాబాద్‌లో రేటు ఎంతంటే?

అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. గురువారం 10 గ్రాముల మేలిమి (24) క్యారెట్ల బంగారం తొలిసారిగా రూ.84 వేలు దాటింది.

By Knakam Karthik
Published on : 31 Jan 2025 10:46 AM IST

Business News, Gold Rate Hike, Silver Rates, Hyderabad

బంగారం ధరలకు రెక్కలు..హైదరాబాద్‌లో రేటు ఎంతంటే?

అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. గురువారం 10 గ్రాముల మేలిమి (24) క్యారెట్ల బంగారం తొలిసారిగా రూ.84 వేలు దాటింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గోల్డ్, వెండి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1200 పెరిగి రూ.77,300లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,310 పెరగడంతో రూ.84,330 పలుకుతోంది. ఇటీవల కాలంలో ఈ స్థాయి ధరలు పెరగడం ఇదే తొలిసారిగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక కిలో వెండి ధర రూ.1000 పెరిగి రూ.1,07,000లకు చేరింది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల, దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రమవుతుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇందువల్ల ఆర్థిక భరోసా కోసం పెట్టుబడులను పసిడిపైకి మళ్లిస్తున్నారు. డాలర్‌తో పోలిస్తే, రూపాయి విలువ క్షీణతను అడ్డుకునేందుకు.. అత్యవసరం కాని ఉత్పత్తులు, లోహాలపై దిగుమతి సుంకాన్ని వచ్చే బడ్జెట్లో పెంచుతారనే అభిప్రాయం వ్యాపార వర్గాల్లో ఉంది. ఇందువల్ల ధర మరింత పెరుగుతుందనే అంచనాతో, కొనుగోలు చేసి ఉంచుతున్నారని చెబుతున్నారు.

Next Story