నూతన ఇన్నోవా క్రిస్టా టాప్‌ గ్రేడ్స్‌ ధరలను ప్రకటించిన టయోటా కిర్లోస్కర్‌ మోటర్‌

Toyota Kirloskar Motor announces prices of Innova Crysta top grades. టయోటా కిర్లోస్కర్‌ మోటర్‌ (టీకెఎం) నేడు తమ నూతన ఇన్నోవా క్రిస్టా రెండు గ్రేడ్స్‌ (జెడ్‌ఎక్స్‌, వీఎక్స్‌) ధరలను వెల్లడించింది

By Medi Samrat  Published on  2 May 2023 10:45 AM GMT
నూతన ఇన్నోవా క్రిస్టా టాప్‌ గ్రేడ్స్‌ ధరలను ప్రకటించిన టయోటా కిర్లోస్కర్‌ మోటర్‌

టయోటా కిర్లోస్కర్‌ మోటర్‌ (టీకెఎం) నేడు తమ నూతన ఇన్నోవా క్రిస్టా రెండు గ్రేడ్స్‌ (జెడ్‌ఎక్స్‌, వీఎక్స్‌) ధరలను వెల్లడించింది. ఈ వాహనం మెరుగైన ఫ్రంట్‌ ఫేసిమా కలిగి ఉంటుంది. వీటిని కఠినమైన, ధృడమైన ప్రదర్శన కోసం నిర్థిష్టమైన ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. తద్వారా ఈ వాహ‌నం భారతీయ కుటుంబాలు, వ్యాపారవేత్తలు, కార్పోరేట్‌ అవసరాలు తీరుస్తుంది.

ఎక్స్‌ షోరూమ్‌ ధరలు, గ్రేడ్‌ల వారీగా ఈ విధంగా ఉన్నాయి.

ఈ ఎక్స్‌ షోరూమ్‌ ధరలు దేశవ్యాప్తంగా అన్ని గ్రేడ్‌లకూ వర్తిస్తాయి. ప్రీమియం కలర్స్‌కు అదనపు ధరలు వర్తిస్తాయి. ఈ సందర్భంగా టయోటా కిర్లోస్కర్‌ మోటర్‌ సేల్స్‌, స్ట్రాటజిక్‌ మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్ అతుల్‌ సూద్‌ మాట్లాడుతూ ‘‘ నూతన ఇన్నోవా క్రిస్టల్‌ డీజిల్‌ టాప్‌ టూ గ్రేడ్‌ ధరలను వెల్లడిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. ఈ వాహనాన్ని వినియోగదారులు అన్ని నూతన వేరియంట్లలోనూ ఆదరిస్తున్నారు. దీని యొక్క కఠినమైన, ధృడమైన ముందు భాగం మరియు శైలి, సౌకర్యం, పనితీరు సమ్మేళనం ఇన్నోవా వారసత్వంను ముందుకు తీసుకువెళ్లనుంది. ఈ వాహనంలో అత్యాధునిక భద్రతా ఫీచర్లు ప్రయాణీకులకు అత్యున్నత భద్రతను అందించనున్నాయి. ఈ వాహనం అందించే మెరుగైన డ్రైవింగ్‌ అనుభవాలను మా వినియోగదారులు ఆస్వాదించడంతో పాటుగా ప్రశంసించగలరనే నమ్మకంతో ఉన్నాము’’అని అన్నారు.


ఈ నూతన ఇన్నోవా క్రిస్టా ను 50వేల రూపాయలు చెల్లించి బుక్‌ చేసుకోవచ్చు. వినియోగదారులు డీలర్‌ ఔట్‌లెట్లుతో పాటుగా www.toyotabharat.com.. వద్ద ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చు. ఈ నూతన ఇన్నోవా క్రిస్టా నాలుగు గ్రేడ్స్‌ G, GX, VX & ZX మరియు ఐదు రంగులు– సూపర్‌ వైట్‌, ఆటిట్యూడ్‌ బ్లాక్‌ మికా, అవంత్‌ గ్రేడ్‌ బ్రాంజ్‌ మెటాలిక్‌, ప్లాటినమ్‌ వైట్‌ పెరల్‌ మరియు సిల్వర్‌ మెటాలిక్‌లో లభ్యమ‌వ‌నుంది.


Next Story