పీఎన్‌జీ, సీఎన్‌జీ ధరలను తగ్గించిన టొరెంట్ గ్యాస్

Torrent Gas Cuts PNG And CNG Prices By Rs 5. CNG, PNG ధరలను వరుసగా కిలోకు రూ. 5, ఎస్‌సీఎం(Supply Chain Management) కి

By Medi Samrat  Published on  17 Aug 2022 11:30 AM GMT
పీఎన్‌జీ, సీఎన్‌జీ ధరలను తగ్గించిన టొరెంట్ గ్యాస్

CNG, PNG ధరలను వరుసగా కిలోకు రూ. 5, ఎస్‌సీఎం(Supply Chain Management) కి రూ. 5 తగ్గిస్తున్నట్లు టోరెంట్ గ్యాస్ ఈరోజు ప్రకటించింది. 17 ఆగస్టు 2022 నుండి ఈ ధ‌ర‌ అమలులోకి వస్తుందని పేర్కొంది.

పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ద్వారా దేశీయ సహజవాయువు కేటాయింపులు పెరగడం వల్ల ధరల తగ్గింపు సాధ్యమైంది. CGD రంగంలోని దేశీయ PNG, CNG విభాగాలకు గ్యాస్ కేటాయింపు కోసం పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ యొక్క సవరించిన మార్గదర్శకాల ప్రకారం.. జనవరి నుండి మార్చి 22 త్రైమాసికంలో సగటు వినియోగంలో 85% ,ఏప్రిల్ నుండి జూన్ 22 త్రైమాసికంలో సగటు వినియోగంలో 94%కి పెరిగింది.

ధరలలో తగ్గింపు, వినియోగదారులకు గణనీయమైన ఉపశమనాన్ని కలిగిస్తుంది. గృహాల ద్వారా దేశీయ PNG, వాహన యజమానులు CNGని స్వీకరించడానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఈ తగ్గుదలతో సంగారెడ్డిలో డొమెస్టిక్ PNG యొక్క సవరించిన ధర SCMకి రూ. 45 (పన్నులతో సహా); LPGకి 31% తగ్గింపును సూచిస్తుంది. CNG యొక్క సవరించిన ధర రూ. కిలోకు 90; (పన్నులతో సహా) పెట్రోల్‌పై 45% తగ్గింపును సూచిస్తుంది.


Next Story