ప్రతి రోజు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. గత కొద్ది రోజులుగా బంగారం పెరుగుతోంది. కొనుగోలుదారులకు కాస్త ఊరట కలిగించే వార్త ఏంటంటే.. తాజాగా సోమవారం పసిడి ధరలు నిలకడగా ఉన్నాయి. గత వారం రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న పసిడి ధరలకు బ్రేకులు పడ్డాయి.
ఈ రోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 కారెట్ల బంగారం ధర రూ.44,750 వద్ద స్థిరంగా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,820 వద్ద నిలకడగా ఉన్నది. బంగారం ధరలతో పాటుగా వెండి ధరలు కూడా నిలకడ ఉన్నాయి. విజయవాడలో కూడా ఇవే ధరలు ఉన్నాయి. కిలో వెండి ధర రూ.74,100 వద్ద స్థిరంగా ఉన్నాయి.
ఇదిలావుంటే.. బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు చేర్పులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలుయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.