ఆమె ఆడి పాడితే రూ.70 కోట్లు
అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలలో ఆడిపాడడానికి పాప్ ఐకాన్ రిహన్నా భారీ మొత్తాన్ని అందుకుంటున్నారు.
By Medi Samrat Published on 1 March 2024 3:00 PM ISTఅనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలలో ఆడిపాడడానికి పాప్ ఐకాన్ రిహన్నా భారీ మొత్తాన్ని అందుకుంటున్నారు. ఆమె పెర్ఫార్మెన్స్ కు 8-9 మిలియన్ డాలర్లు (రూ. 66 - 74 కోట్లు) మధ్య ఉంటుందని తెలుస్తోంది. గాయని తన బృందంతో కలిసి ఫిబ్రవరి 29న గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చేరుకుంది. ఆమె విమానాశ్రయం నుండి బయటకు రావడంతో ఫోటోగ్రాఫర్ లు ఎగబడ్డారు. రిహన్నా తన హిట్ పాటలతో అలరించనుంది. ఆమె ప్రదర్శన కోసం చాలా ఖర్చు చేయనున్నారు.
రిహన్న చివరి ప్రదర్శన 2023 సూపర్ బౌల్ హాఫ్-టైమ్ షోలో జరిగింది. 121.017 మిలియన్ల వీక్షకులను ఆకర్షించింది. ఇది అత్యధికంగా వీక్షించబడిన సూపర్ బౌల్ షో ఈవెంట్‌లలో ఒకటిగా నిలిచింది. అంబానీ కుటుంబంలో వివాహ వేడుకలో ప్రదర్శన ఇచ్చిన మొదటి పాప్ సింగర్ ఆమె కాదు. 2018లో, బియాన్స్ ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ సంగీత్‌లో ప్రదర్శన ఇచ్చారు. అందుకు ఆమెకు దాదాపు $4 మిలియన్లు (రూ. 33 కోట్లు) చెల్లించినట్లు కథనాలు కూడా వచ్చాయి. రిహన్నతో పాటు, దిల్జిత్ దోసాంజ్ గ్రాండ్ ఈవెంట్‌లో అతిథుల కోసం ప్రదర్శన ఇవ్వనున్నారు. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె, రణవీర్ సింగ్, అలియా భట్, రణబీర్, అర్జున్ కపూర్, 'జవాన్' దర్శకుడు అట్లీ, అతని కుటుంబంతో సహా ప్రముఖులు జామ్‌నగర్‌లో ఈవెంట్ కు వచ్చారు.