కొన్ని దేశాలకు కనీసం వ్యాక్సిన్లు అందడం లేదు. ఇంకొన్ని దేశాల దగ్గర వ్యాక్సిన్లు ఉన్నప్పటికీ.. వాటిని వేసుకోడానికి ప్రజలు ముందుకు రావడం లేదు. దీంతో వ్యాక్సిన్ వేసుకునే వాళ్ళ కోసం ఎన్నో బహుమతులను కూడా ప్రకటిస్తూ ఉన్నారు. అమెరికాలో కూడా పరిస్థితి అలాగే ఉంది. వ్యాక్సిన్ వేసుకోడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ముఖ్యంగా టీనేజర్లు కనీసం వ్యాక్సిన్ వేసుకుందామని అనుకోవడం లేదు. దీంతో మాంచి కాస్ట్లీ బహుమతులు ఇస్తాము.. వ్యాక్సిన్లు వేసుకోండి అని అధికారులు అడుక్కుంటూ ఉన్నారు.
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఉన్న టీనేజర్లను వ్యాక్సిన్‌లు వేసుకునేందుకు ముందుకు వచ్చిన వాళ్లకు ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ( Apple AirPods )ను ఫ్రీగా ఉచితంగా ఇస్తున్నారు. అంతేకాకుండా లక్కీ డ్రాలో 25 వేల డాలర్ల స్కాలర్‌షిప్ లేదా ఐప్యాడ్ కూడా గెలుచుకోవచ్చట..! ఈ విషయాన్ని వాషింగ్టన్ డీసీ మేయర్ మురియల్ బౌజర్ తెలిపారు. వాషింగ్టన్ డీసీతోపాటు చుట్టుపక్కల ఉన్న టీనేజర్లకు తొలి డోసు తీసుకుంటే ఎయిర్‌పాడ్స్, గిఫ్ట్‌కార్డులు, స్కాలర్‌షిప్పులు ఉచితమని అన్నారు. అధికారులు చెప్పిన తేదీ నుండి డీసీ యువత (12-17) ఎవరైతే బ్రూక్‌లాండ్ ఎంఎస్, సౌసా ఎంఎస్, జాన్సన్ ఎంఎస్‌లలో వ్యాక్సిన్ తీసుకుంటారో వాళ్లకు ఎయిర్‌పాడ్స్ ఇస్తామని చెబుతూ ఉన్నారు. అంతేకాదు 25 వేల డాలర్ల స్కాలర్‌షిప్, ఐప్యాడ్ గెలుచుకునే అవకాశం కూడా వాళ్లకు ఉంటుంది అని బౌజర్ ట్వీట్ చేశారు. వ్యాక్సిన్ తొలి డోసు వేసుకునే వారికి ఈ అవకాశం దక్కనుంది.