టాటా మోటార్స్ ఈరోజు భారతదేశంలో తన మూడవ ఎలక్ట్రిక్ మోడల్ ను లాంఛ్ చేసింది. టియాగో EVని రూ. 8.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. Tiago EV టాప్-ఆఫ్-ది-లైన్ వేరియంట్ ధర రూ. 11.79 లక్షలు (ఎక్స్-షోరూమ్) అని తెలిపారు. ఈ ధరలు మొదటి 10,000 మంది వినియోగదారులకు మాత్రమే వర్తిస్తాయి. Tiago EV కాకుండా.. Nexon EV, Tigor EVలను కూడా టాటా మోటార్స్ అమ్ముతోంది.
Tiago EV కోసం బుకింగ్‌లు అక్టోబర్ 10న ప్రారంభమవుతాయి. వాహనం యొక్క డెలివరీలు వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమవుతాయి. పూర్తిగా చార్జ్ చేసిన తర్వాత టియాగో ఈవీ గరిష్ఠంగా 315 కిమీ దూరం ప్రయాణిస్తుంది. స్పోర్ట్ మోడ్‌లో 5.7 సెకన్లలో 0-60 కి.మీ. వేగం అందుకుంటుది. టియాగో ఈవీలో ప్రొజెక్టర్ ఆటో హెడ్‌ల్యాంప్‌లు, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు, డ్యూయల్-టోన్ రూఫ్, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, లెథర్ సీట్లు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా, కూల్డ్ గ్లోవ్‌బాక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
టాటా మోటార్స్ Tiago EV తొలి 10,000 యూనిట్లలో 2,000 యూనిట్లను రిజర్వ్ చేసింది. కొత్త టాటా టియాగో EV రెండు విభిన్న బ్యాటరీ ప్యాక్‌లతో లభిస్తుంది. అవి 19.2kWh, 24kWh. 19.2kWh వేరియంట్ 3.3kW AC ఛార్జింగ్ ఎంపికను పొందగా, 24kWh వేరియంట్‌లో 3.3kW AC, 7.2kW AC ఛార్జింగ్ ఎంపికతో రానున్నాయి.
టియాగో EV 19.2kWh/3.3kW AC
XE - రూ. 8.49 లక్షలు
XT - రూ. 9.09 లక్షలు
టియాగో EV 24kWh/3.3kW AC
XT - రూ. 9.99 లక్షలు
XZ+ - రూ. 10.79 లక్షలు
XZ+ టెక్ LUX - రూ. 11.29 లక్షలు
టియాగో EV 24kWh/7.2kW AC
XZ+ - రూ. 11.29 లక్షలు
XZ+ టెక్ LUX - రూ. 11.79 లక్షలు