జీఎస్టీ రేటు తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించడానికి, మహీంద్రా & మహీంద్రా కంపెనీ తన ప్యాసింజర్ వాహనాల శ్రేణి ధరలను రూ.1.56 లక్షల వరకు తగ్గించినట్లు తెలిపింది. సెప్టెంబర్ 3, 2025న జరిగిన 56వ GST కౌన్సిల్ సమావేశంలో పునరుద్ధరించిన GST తర్వాత ధర తగ్గింపు జరిగింది.
వర్తించే అన్ని ICE పోర్ట్‌ఫోలియోలకు సవరించిన ధరలు సెప్టెంబర్ 6, 2025 నుండి అమలులోకి వచ్చాయి. డీలర్‌షిప్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో కొత్త ధరలను అప్డేట్ కూడా చేశారు.
బొలెరో/నియో శ్రేణి ధరలను రూ.1.27 లక్షలు, XUV3XO (పెట్రోల్) రూ.1.4 లక్షలు, XUV3XO (డీజిల్) రూ.1.56 లక్షలు, THAR 2WD (డీజిల్) రూ.1.35 లక్షలు, THAR 4WD (డీజిల్) రూ.1.01 లక్షలు, స్కార్పియో క్లాసిక్ ధరలను రూ.1.01 లక్షలు తగ్గించినట్లు కంపెనీ తెలిపింది. అదేవిధంగా స్కార్పియో-ఎన్ ధరను రూ.1.45 లక్షలు, థార్ రాక్స్ రూ.1.33 లక్షలు, XUV700 ధరను రూ.1.43 లక్షలు తగ్గించారు.