ప్రయాణీకులకు అలర్ట్.. ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మారిన 12 ప్యాసింజర్ రైళ్లు
South Central Railway converted 12 passenger trains to Express trains.రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు దక్షిణ మధ్య
By తోట వంశీ కుమార్ Published on
9 Nov 2021 5:31 AM GMT

రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే ఓ చేదు, ఓ శుభ వార్త చెప్పింది. కరోనా మహమ్మారి కారణంగా నిలిపోయిన 12 ప్యాసింజర్ రైళ్ల సేవలను పునరుద్దరిస్తున్నట్లు తెలిపింది. అయితే.. ఇకపై అవి అన్ రిజర్వుడ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా నడవనున్నట్లు చెప్పింది. ప్యాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా నడపనుండడంతో చార్జీలు పెరగడంతో పాటు రైలు ఆగే స్టేషన్ల సంఖ్య కూడా పరిమితం కానుంది.
ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మారిన ప్యాసింజర్ రైళ్లు:
* కాచిగూడ-మిర్యాలగూడ-కాచిగూడ (07276/07974). ఈ రైలు ఈ నెల 11 నుంచి అందుబాటులోకి వస్తుంది
* మిర్యాలగూడ-నడికుడి-మిర్యాలగూడ (07277/07273). ఈ రైలు ఈ నెల 11 నుంచి అందుబాటులోకి వస్తుంది.
* తెనాలి-రేపల్లె-తెనాలి (07873/07874), రేపల్లె-తెనాలి-రేపల్లె (07875/07876). ఇది ఈ నెల 13 నుంచి అందుబాటులోకి వస్తుంది.
* నర్సాపూర్-విజయవాడ-నర్సాపూర్ (07044/07045). ఈ డెమో రైలు 14 నుంచి అందుబాటులోకి వస్తుంది.
* కాచిగూడ-రొటెగాం-కాచిగూడ (07571/07572) ఈ నెల 15 నుంచి అందుబాటులోకి వస్తుంది.
Next Story