అనిల్ అంబానీపై బ్యాన్

రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ మాజీ అధికారులతో సహా పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, 24 ఇతర సంస్థలను సెక్యూరిటీస్ మార్కెట్ నుండి ఐదేళ్లపాటు సెబీ నిషేధించింది

By Medi Samrat  Published on  23 Aug 2024 9:50 AM GMT
అనిల్ అంబానీపై బ్యాన్

రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ మాజీ అధికారులతో సహా పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, 24 ఇతర సంస్థలను సెక్యూరిటీస్ మార్కెట్ నుండి ఐదేళ్లపాటు సెబీ నిషేధించింది. సెబీ అంబానీపై రూ. 25 కోట్ల పెనాల్టీని విధించింది. ఐదేళ్ల పాటు రెగ్యులేటర్‌లో నమోదైన ఏదైనా లిస్టెడ్ కంపెనీ లేదా మధ్యవర్తిగా డైరెక్టర్ లేదా కీ మేనేజర్ పర్సనల్ గా సేవలందించడంతో పాటు సెక్యూరిటీస్ మార్కెట్‌తో ఎలాంటి అనుబంధం లేకుండా నిషేధిస్తున్నట్లు ప్రకటన వచ్చింది. 'రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్ (ఆర్‌హెచ్ఎఫ్ఎల్‌)లో కీలకంగా వ్యవహరించిన మాజీ అధికారులు సహా, మరో 27 సంస్థలపైనా నిషేధం అమలు లోకి వచ్చింది. రిలయన్స్‌ హోమ్ ఫైనాన్స్‌ను సైతం సెక్యూరిటీ మార్కెట్ల నుంచి 6 నెలల పాటు నిషేధించింది. రూ.6 లక్షల జరిమానా కూడా విధించింది. ఆర్డర్ అందిన 45 రోజుల్లోగా ఈ పెనాల్టీని చెల్లించాలని ఆదేశించింది.

ఆస్తులు, నగదు ప్రవాహం లేదా ఆదాయం తక్కువగా ఉన్న కంపెనీలకు వందల కోట్ల విలువైన రుణాలు ఆమోదించారు. ఈ రుణాల వెనుక ఉద్దేశపూర్వక చర్యలు ఉన్నాయని సూచిస్తున్నట్లు సెబీ పేర్కొంది. ఈ రుణగ్రహీతలలో చాలా మంది డిఫాల్ట్ అయ్యారు. దీంతో 9 లక్షల మంది ఇన్వెస్టర్లతో సహా పబ్లిక్ షేర్ హోల్డర్లు గణనీయమైన నష్టాలను చవిచూశారు.

Next Story