జూలై 17 వరకు ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ కొనసాగనుంది. అయితే ఈ సేల్ ను ఆసరా చేసుకుని సైబర్ మోసగాళ్లు అమాయకులను టార్గెట్ చేస్తున్నారు. మునుపటి సంవత్సరాల మాదిరిగానే, ఈ సేల్స్ సీజన్‌లో నకిలీ వెబ్‌సైట్‌లు, నకిలీ కస్టమర్ సపోర్ట్ ఖాతాలు, కొనుగోలుదారులను తప్పుదారి పట్టించడానికి మోసం చేయడానికి సిద్ధమయ్యాయి. అందుకు సంబంధించి రూపొందించిన ఫిషింగ్ లింక్‌లు చాలా ఆన్ లైన్ లో కనిపించాయి.
ఈ సైట్‌లలో చాలా వరకు వైరస్‌టోటల్ వంటి భద్రతా స్కానర్‌ల ద్వారా హానికరమైనవిగా గుర్తించారు. ఈ వెబ్‌సైట్‌లు ఫ్లిప్‌కార్ట్ డిజైన్‌ను అనుకరిస్తాయి, డొమైన్ పేర్లను దగ్గరగా పోలి ఉంటాయి. వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని తెలుసుకోడానికి వినియోగదారులను ఆకర్షించడానికి భారీ డిస్కౌంట్లను అందిస్తాయి. చాలా సైట్‌లు సేల్ ప్రారంభమయ్యే రెండు వారాల ముందు సృష్టించబడ్డాయి. కాబట్టి ఇలాంటి లింక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.