2025 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్ల పరికరాలకు గెలాక్సీ ఏఐని అందుబాటులోకి తీసుకురానున్న సామ్‌సంగ్
2025 సంవత్సరం చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్ల పరికరాలకు గెలాక్సీ ఏఐ తీసుకురానున్నట్టు సామ్‌సంగ్ ఈరోజు ప్రకటించింది.
By - న్యూస్‌మీటర్ తెలుగు |
2025 సంవత్సరం చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్ల పరికరాలకు గెలాక్సీ ఏఐ తీసుకురానున్నట్టు సామ్‌సంగ్ ఈరోజు ప్రకటించింది. 2024లో, ప్రపంచంలోని మొట్టమొదటి ఏఐ ఫోన్, గెలాక్సీ S24 సిరీస్‌ను సామ్‌సంగ్ విడుదల చేసింది, ఇది ఏఐ ఆవిష్కరణకు మార్గం సుగమం చేసింది. అప్పటి నుండి, మల్టీమోడల్ ఇంటెలిజెన్స్‌ను అభివృద్ధి చేయడం ద్వారా సామ్‌సంగ్ , తమ మొబైల్ ఏఐ పర్యావరణ వ్యవస్థను విస్తరించింది. వేరబల్స్ , టాబ్లెట్‌లు, పిసి లు మరియు అంతకు మించిన ఉత్పత్తులలో ఏఐ ని మిళితం చేసింది.
గెలాక్సీ పరికరాలకు అపూర్వమైన రీతిలో డిమాండ్ పెరుగుతోంది, గెలాక్సీ S25 వినియోగదారులతో 70% కంటే ఎక్కువ మంది వినియోగదారులు గెలాక్సీ ఏఐని చురుకుగా ఉపయోగిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన గెలాక్సీ జెడ్ సిరీస్, వన్ యుఐ 8 ద్వారా సామ్‌సంగ్ యొక్క అత్యంత మెరుగైన ఫీచర్లను చేర్చడంతో గెలాక్సీ ఏఐని మరింత మంది వినియోగదారుల చెంతకు తీసుకువచ్చింది.
గత రెండు సంవత్సరాలుగా గెలాక్సీ ఏఐని వినియోగదారులు విస్తృతంగా స్వీకరించారు, సామ్‌సంగ్ దాని వన్ యుఐ మెరుగుదలల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు శక్తివంతమైన, సృజనాత్మక , ఉత్పాదక ఫీచర్లను అందిస్తోంది. ఈ సంవత్సరం చివరి నాటికి, ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్లకు పైగా పరికరాలకు గెలాక్సీ ఏఐ అనుభవాన్ని తీసుకురావాలని సామ్‌సంగ్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఎక్కువగా ఉపయోగించే గెలాక్సీ ఏఐ ఫీచర్లలో ఫోటో అసిస్ట్ & ఆడియో ఎరేజర్ ఉన్నాయి, గెలాక్సీ S24 తో పోలిస్తే గెలాక్సీ S25 వినియోగదారులలో ఫోటో అసిస్ట్ వినియోగం దాదాపు రెట్టింపు అయింది. గ్యాలరీ యాప్‌లో ఫోటోలను ఎడిట్ చేయటంలో మీకు సహాయపడటానికి ఫోటో అసిస్ట్ వివిధ ఏఐ ఫీచర్లను అందిస్తుంది, అయితే ఆడియో ఎరేజర్ ఫీచర్ మీ వీడియోల నుండి దృష్టి మరల్చే నేపథ్య శబ్దాలను సర్దుబాటు చేయడానికి లేదా తొలగించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
ఇతరులతో సంభాషణలు చేయడంను సౌకర్యవంతంగా చేసే ఇంటర్‌ప్రెటర్ మరియు లైవ్ ట్రాన్స్‌లేట్ ఫీచర్‌లు కూడా ఎక్కువగా ఉపయోగించిన ఏఐ ఫీచర్లలో ఉన్నాయి. ఇంటర్‌ప్రెటర్ వ్యక్తిగత సంభాషణలను నిజ సమయంలో అనువదిస్తుంది, లైవ్ ట్రాన్స్‌లేట్ వాయిస్ కాల్‌లు, ముఖాముఖి సంభాషణలు మరియు టెక్స్ట్ సందేశాలను మీకు ఇష్టమైన భాషల్లోకి స్వయంచాలకంగా అనువదిస్తుంది.
గూగుల్ తో భాగస్వామ్యంతో, సామ్‌సంగ్ జెమిని లైవ్ మరియు సర్కిల్ టు సెర్చ్ వంటి ఎక్కువమంది అభిమానించే ఫీచర్లను కూడా అందుబాటులోకి తీసుకువస్తోంది. గెలాక్సీ ఎస్ 25 వినియోగదారులలో సగానికి పైగా ఎక్కువమంది ప్రతిరోజూ సర్కిల్ టు సెర్చ్ ను ఉపయోగిస్తున్నారు.
వినియోగదారులు మొత్తం గెలాక్సీ S25 శ్రేణి మరియు గెలాక్సీ Z ఫ్లిప్ 7 మోడళ్లలో 50MP వెనుక కెమెరాను పొందుతారు, అయితే గెలాక్సీ S25 అల్ట్రా మరియు జెడ్ ఫోల్డ్ 7 వినియోగదారులు గుర్తించదగిన 200MP అల్ట్రా-వైడ్ లెన్స్‌ను కూడా పొందవచ్చు. 2020లో ప్రవేశపెట్టినప్పటి నుండి, వీడియో అభిమానులు 8K వీడియో సామర్థ్యాలను కూడా పొందుతున్నారు. ప్రో విజువల్ ఇంజిన్‌తో దీనిని జత చేసినప్పుడు, వినియోగదారులు మరిన్ని అనుకూలీకరణ ఎంపికలను పొందవచ్చు.
చివరగా, సామ్‌సంగ్ యొక్క జనరేటివ్ ఎడిట్, వినియోగదారులు తమకు అవసరమైన వాటిని వుంచుకోవటానికి , వారి ఫోటోలను మెరుగుపరచుకోవడానికి మరియు సెకన్లలో అధిక-నాణ్యత విజువల్స్‌ను సృష్టించడానికి అనుమతిస్తుంది. పరిశ్రమ యొక్క ఉత్తమ హార్డ్‌వేర్‌తో నిర్మించబడిన సామ్‌సంగ్, గెలాక్సీ పరికరాల కోసం ప్రత్యేకమైన క్వాల్ కామ్ చిప్, స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ద్వారా ఆధారితమైన సౌకర్యవంతమైన ఏఐ అనుభవాన్ని వినియోగదారులకు అందిస్తుంది.
కొరియా వెలుపల సామ్‌సంగ్ యొక్క అతిపెద్ద పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రమైన ఎస్ఆర్ఐ -బెంగళూరు, ప్రసిద్ధ గెలాక్సీ ఏఐ ఫీచర్లు అయినటువంటి ఫోటో అసిస్ట్, ఆడియో ఎరేజర్, ఇంటర్‌ప్రెటర్, లైవ్ ట్రాన్స్‌లేట్ మరియు నౌ బ్రీఫ్ వంటి వాటిని అందించటం ద్వారా అర్థవంతమైన సహకారాన్ని అందించింది. గెలాక్సీ ఏఐ ప్రస్తుతం హిందీతో సహా 30 భాషలు మరియు మాండలికాలకు మద్దతు ఇస్తుంది.