కొత్త ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేస్తోన్న శామ్‌సంగ్

Samsung is launching new foldable phones. బెంగళూరు లోని శామ్‌సంగ్ ఒపేరా హౌస్ లో ఆగస్టు 10 వ తేదీన గెలాక్సీ అన్‌ప్యాక్డ్

By Medi Samrat  Published on  9 Aug 2022 5:12 PM IST
కొత్త ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేస్తోన్న శామ్‌సంగ్

బెంగళూరు లోని శామ్‌సంగ్ ఒపేరా హౌస్ లో ఆగస్టు 10 వ తేదీన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో శామ్‌సంగ్ తమ తర్వాతి తరం ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేయబోతున్నది. కస్టమర్లు త్వరిత గ‌తిన‌ గెలాక్సీ స్మార్ట్ ఫోన్లను పొంద‌డానికి ముందస్తుగా-రిజర్వు చేసుకోవచ్చు. రిజర్వు చేసుకోవడానికి గాను, కస్టమర్లు Samsung.com లేదా శామ్‌సంగ్ ప్రత్యేక షోరూం వద్ద ఒక టోకెన్ మొత్తం రూ. 1,999 చెల్లించాల్సి ఉంటుంది.

గెలాక్సీ స్మార్ట్ ఫోన్లను ముందస్తుగా-రిజర్వు చేసుకున్న కస్టమర్లు.. ఫోన్‌ డెలివరీ అయిన‌ తర్వాత రూ.5,000 ల విలువైన అదనపు ప్రయోజనాలు పొందుతారు. శామ్‌సంగ్ అర్థవంతమైన ఆవిష్కరణలను విశ్వ‌సిస్తుంది. వినియోగ‌దారుల‌ దైనందిన జీవితం సుసంపన్నం, మరింత బహుముఖం అయ్యే ఒక వేదికను అందిస్తూ సాంకేతికతను అధిగమిస్తుంది. ఆగస్టు 10 వ తేదీన భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు శామ్‌సంగ్ న్యూస్‌రూమ్ ఇండియాపై గెలాక్సీ అన్‌ప్యాక్డ్-2022 ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది.


Next Story