గెలాక్సీ S22 సిరీస్ ఫిబ్రవరి 9న లాంచ్.. ప్రత్యేకతలు ఇవే..

Samsung Galaxy S22 series launch on Feb 9. గెలాక్సీ S22 సిరీస్ ను ఫిబ్రవరి 9 న లాంచ్ చేయడానికి శామ్‌సంగ్ సంస్థ సిద్ధమవుతోంది.

By Medi Samrat  Published on  1 Feb 2022 2:45 PM GMT
గెలాక్సీ S22 సిరీస్ ఫిబ్రవరి 9న లాంచ్.. ప్రత్యేకతలు ఇవే..

గెలాక్సీ S22 సిరీస్ ను ఫిబ్రవరి 9 న లాంచ్ చేయడానికి శామ్‌సంగ్ సంస్థ సిద్ధమవుతోంది. Galaxy S22 సిరీస్ మూడు వేరియంట్‌లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. గత కొన్ని నెలలుగా అనేక లీక్‌లు బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ సిరీస్‌లో గెలాక్సీ ఎస్ 22, గెలాక్సీ ఎస్ 22 ప్లస్ మరియు ఇప్పుడు గెలాక్సీ ఎస్ 22 నోట్ (గెలాక్సీ ఎస్ 22 అల్ట్రాకు బదులుగా) లు రావచ్చని అంటున్నారు.

S22 మొబైల్.. 6.1-అంగుళాల OLED ప్యానెల్‌తో 120Hz రిఫ్రెష్ రేట్ తో గరిష్టంగా 1500 నిట్స్ ప్రకాశంతో వస్తుందని భావిస్తున్నారు. ప్యానెల్‌లో గొరిల్లా గ్లాస్ విక్టస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ Snapdragon 8 Gen 1ని, Exynos 2200 కలిగి ఉంటుందని చెబుతున్నారు. కెమెరా విషయంలో 50MP ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ సెన్సార్ మరియు 10MP టెలిఫోటో సెన్సార్‌ని కలిగి ఉండొచ్చు. వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతుతో 3,700mAh బ్యాటరీ కూడా అందించబడుతుంది. ఇతర స్పెసిఫికేషన్లలో Wi-Fi 6 సపోర్ట్, NFC, 5G, బ్లూటూత్ 5.2, ఇన్-డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్, IP68 సర్టిఫికేషన్ ఉన్నాయి. ఫోన్ బ్లాక్, వైట్, గ్రీన్ మరియు పింక్ రంగుల్లో వస్తుందని అంచనా వేస్తున్నారు.

Samsung Galaxy S22 ప్లస్ లో చాలా వరకూ S22 ఫీచర్లు ఉండగా.. కొన్ని ప్రత్యేకమైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్నట్లు నివేదించబడింది. చిప్‌సెట్, కెమెరాలు, స్టోరేజ్ వేరియంట్‌లలో మార్పు ఉండవచ్చు. ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గరిష్టంగా 1750 nits ప్రకాశంతో పెద్ద 6.6-అంగుళాల OLED డిస్‌ప్లే ప్యానెల్‌తో రావచ్చు. S22 ప్లస్ పెద్ద 4,500 బ్యాటరీతో రావచ్చు. IP68 సర్టిఫికేషన్, గొరిల్లా గ్లాస్ విక్టస్‌ను కలిగి ఉంటుంది. Samsung Galaxy S22 Plus నలుపు, తెలుపు, ఆకుపచ్చ, పింక్ గోల్డ్ అనే నాలుగు రంగులలో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.

Samsung Galaxy S22 Note/ Galaxy S22 Ultra

ఇందులో పెద్ద 6.8-అంగుళాల QHD+ OLED ప్యానెల్, 120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగి ఉంటుంది. డిస్ప్లే 1750నిట్స్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉండనుంది. Galaxy S22 Note/Ultra కూడా S-Pen సపోర్ట్‌ని ప్యాక్ చేస్తుందని భావిస్తున్నారు. Galaxy Note సిరీస్ నుండి నేరుగా S-పెన్‌ని డాక్ చేయడానికి అంతర్నిర్మిత కేవిటీతో వస్తుందని నివేదించబడింది. S22 నోట్/అల్ట్రా కూడా ప్రాంతాన్ని బట్టి Snapdragon 8 Gen 1 లేదా Exynos 2200 ద్వారా అందించబడుతుందని చెబుతున్నారు. 12GB RAM వేరియంట్‌తో కూడా రావచ్చు. ఫోన్‌లో 108MP ప్రధాన కెమెరా సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 3X మరియు 10X ఆప్టికల్ జూమ్ కోసం రెండు 10MP సెన్సార్‌లు కూడా ఉంటాయి. 40Mp ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. Samsung Galaxy S22 Note/Ultra నలుపు, తెలుపు, ఆకుపచ్చ రంగులలో అందుబాటులో ఉంటుందని నివేదించబడింది. 12GB RAM వేరియంట్ గరిష్టంగా 512GB నిల్వతో రావచ్చు.


Next Story