50 మెగా పిక్సెల్ కెమెరాతో రానున్న శాంసంగ్ గెలాక్సీ A23

Samsung Galaxy A23 may come with a 50MP camera. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ 'Samsung Galaxy A23' స్మార్ట్‌ఫోన్ ను

By Medi Samrat  Published on  1 Dec 2021 7:44 PM IST
50 మెగా పిక్సెల్ కెమెరాతో రానున్న శాంసంగ్ గెలాక్సీ A23

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ 'Samsung Galaxy A23' స్మార్ట్‌ఫోన్ ను తీసుకుని రావడానికి ప్రణాళికలు రచిస్తోంది. శాంసంగ్ కంపెనీ తరపున జనాదరణ పొందిన 'A' స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో భాగంగా రాబోతోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో జూన్‌లో ప్రారంభించబడిన Samsung Galaxy A22 వారసత్వంలో ఈ మొబైల్ ఫోన్ రానుంది. కొత్త లీక్ Samsung Galaxy A23 యొక్క కొన్ని స్పెసిఫికేషన్‌లను బయట పెట్టింది. గెలాక్సీ క్లబ్ నివేదిక ప్రకారం, Samsung Galaxy A23 4G మరియు 5G వేరియంట్‌లలో విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా 50MP ప్రైమరీ లెన్స్‌ను కలిగి ఉంటుందని, 5,000mAh బ్యాటరీ కెపాసిటీ కలిగి ఉందని నివేదిక చెబుతోంది. Samsung Galaxy A23 స్మార్ట్‌ఫోన్ గురించి ఇతర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

జూలైలో శాంసంగ్ కంపెనీ Galaxy A22 5G స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6GB+128GB వేరియంట్ ధర రూ.19,999 మరియు 8GB+128GB వేరియంట్ ధర రూ.21,999గా ఉంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 48MP ప్రధాన కెమెరా, 5MP అల్ట్రా-వైడ్ లెన్స్ మరియు 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి. హై క్లారిటీ సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. MediaTek Dimensity 700 ప్రాసెసర్‌తో ఆధారితమైంది ఈ మొబైల్. Galaxy A22 5Gలో 5000mAh బ్యాటరీ మరియు ఇన్-బాక్స్ 15W USB-C ఫాస్ట్ ఛార్జర్ ఉన్నాయి. ఇది Android 11 మరియు One UI కోర్ 3.1కి మద్దతు ఇస్తుంది.


Next Story