రిలయన్స్ జియో భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో సర్వీస్ అంతరాయాన్ని ఎదుర్కొంటోంది. జియో వినియోగదారులు కమ్యూనికేషన్ అప్లికేషన్‌లను యాక్సెస్ చేయలేకపోతున్నారు. కనీసం కాల్స్ కూడా కనెక్ట్ అవ్వడం లేదని.. ఇంటర్నెట్ యాక్సెస్ లేకుండా పోయిందని పలువురు జియో వినియోగదారులు ఫిర్యాదులు చేశారు. జియో ఫైబర్ విషయంలో కూడా సమస్యలు తలెత్తాయని పలువురు సోషల్ మీడియా యూజర్లు ఫిర్యాదులు చేశారు.
డౌన్ డిటెక్టర్ ప్రకారం.. మధ్యాహ్నం 1.41 గంటలకు దాదాపు 2,300 ఫిర్యాదులు భారీగా వచ్చాయి. మధ్యాహ్నం 2.11 గంటలకు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఆ తర్వాత మళ్లీ ఫిర్యాదులు పెరిగాయి. అంతరాయానికి కారణం తెలియదు. ఈ పరిస్థితికి సంబంధించి రిలయన్స్ జియో నుండి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.