ఎట్టకేలకు రిజ్వర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్‌న్యూస్ చెప్పింది. రెపోరేటును 25 బేసిస్ పాయింట్ల మేర కత్తిరిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రెపోరేటును 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గించింది. 2024 ఫిబ్రవరి 8 నుంచి వడ్డీరేట్లు 6.50 శాతం వద్దే గరిష్ఠంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ద్రవ్యోల్బణం కుదుటపడుతుందని ఆర్‌బీఎస్ గవర్నర్ సంజయ్ మల్హోత్ర తెలిపారు. వడ్డీరేట్ల తగ్గింపుతో ప్రజల చేతుల్లో డబ్బులు మిగులుతాయి. దీంతో వినియోగం పెరిగి ఎకానమీ పుంజుకోనుందని తెలిపారు.
అటు ఫైనాన్షియల్ ఇయర్ 2026లో భారత వృద్ధి రేటు అంచనాను ఆర్‌బీఐ గవర్నర్ మల్హోత్రా 6.6 నుంచి 6.7 శాతానికి సవరించారు. రిజర్వాయర్లలో నీరు సమృద్ధిగా ఉందని, ఖరీఫ్ దిగుబడి పెరుగుతుందని పేర్కొన్నారు. రూరల్ డిమాండ్ అప్‌ట్రెండ్‌లో, అర్బన్ డిమాండ్ ప్లాటుగా కొనసాగుతోందని తెలిపారు. ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు తగ్గడం, ఆదాయ పన్ను మినహాయింపులు పెరగడం, ప్రజల చేతుల్లో ఎక్కువ డబ్బు ఉండటం వృద్ధిరేటు పెరుగుదలకు దోహదం చేస్తాయన్నారు.