2016వ సంవత్సరంలో రూ.1000 కరెన్సీ నోట్లను చలామణి నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పింది. అయితే ఈ నోట్లను మళ్లీ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ ఏడాది మే మధ్యలో రూ.2,000 కరెన్సీ నోట్లను చెలామణి నుంచి తొలగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ. 2,000 కరెన్సీ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటామని ఆర్‌బీఐ ప్రకటించిన తర్వాత రూ.1,000 నోట్లను మళ్లీ ప్రవేశపెట్టడంపై ఊహాగానాలు వచ్చాయి.
జూలైలో, ఆర్థిక మంత్రిత్వ శాఖ రూ. 1,000 నోట్లను మళ్లీ ఆర్థిక వ్యవస్థలో మళ్లీ ప్రవేశపెట్టే ఆలోచన లేదని పేర్కొంటూ పుకార్లను క్లియర్ చేసింది. మరోసారి ఆర్‌బీఐ రూ.1000 నోట్లను ప్రవేశపెట్టబోతోందని పుకార్లు వ్యాపించాయి. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిపై ఎలాంటి ఆలోచన చేయలేదని తెలుస్తోంది. ప్రస్తుతానికి రూ.1000 నోట్లను మళ్లీప్రవేశపెట్టే అంశంపై ఎలాంటి పరిశీలన చేపట్టడం లేదని, అసలు ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది. రూ.1000 నోట్లను మళ్లీ రీఇంట్రడ్యూస్ చేస్తారనే వార్తలు.. పూర్తిగా ఊహాజనితం అని పేర్కొంది. మరోవైపు ఇప్పటికే రూ.2 వేల నోట్లను ఆర్‌బీఐ ఉపసంహరించుకుంది.