వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి కీలక పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.
By అంజి Published on 6 Oct 2023 11:07 AM IST
వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి కీలక పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్థికవేత్తల అంచనాలకు అనుగుణంగా కీలకమైన రెపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగించాలని సెంట్రల్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా నిర్ణయించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు. రెండు రోజుల సమీక్ష తర్వాత 2023 - 24 వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాల్గవ ద్రవ్య విధాన నిర్ణయాన్ని ఇవాళ వెల్లడించారు. ఇందులో భాగంగానే రెపో రేటును 6.50 శాతం వద్ద మార్చకుండా కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నారు.
ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ అక్టోబర్ 4 నుంచి 6 వరకు సమావేశం అయిన తర్వాత గవర్నర్ ఈ ప్రకటన వెలువరించారు. జులైలో టమాటో, ఇతర కూరగాయల ధరల కారణంగా ప్రధాన ద్రవ్యోల్బణం పెరిగింది. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమివ్వాల్సిన అవసరం ఉందని శక్తికాంత దాస్ తెలిపారు. ఇందులో భాగంగానే మరోసారి కీలక రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేశారు. 2023-24లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.4%గా అంచనా వేయబడింది.
RBI’s Monetary Policy Committee decided to maintain the status quo, Repo Rate kept unchanged at 6.50%: RBI Governor Shaktikanta Das pic.twitter.com/IRfAjZ1Jra
— ANI (@ANI) October 6, 2023